సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞానకుమార్)

ఈ యేడు తెలుగు కళా సమితికీ తెలుగుజ్యోతికీ నలభై ఏళ్ళు నిండుతాయి. ఆ సందర్భంగా అక్టోబర్ నెలలో భారీ ఎత్తున వార్షికోత్సవాలు జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు జ్యోతి దీపావళి సంచిక నలభై ఏళ్ళ వార్షికోత్సవ సంచిక గా వెలువడుతుంది. రాజకీయాలు రాకుండా కేవలం మన కళలకీ సాహిత్యానికీ సేవ చేస్తూ గడపగల్గాం ఈ నలభై ఏళ్ళూనూ. తెలుగు కళా సమితితో మీ అనుభవాలు editor@telugujyothi.com కి పంపండి.

తెలుగు తనం మీద వచ్చిన మిగతా రచనలు ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.

సరోజ గారు, మనోహర గారూ, ప్రభాకర మూర్తి గారూ, సుజనా దేవి గారూ, అందరూ కూడా తెలుగు తనమంటే పెసరట్టు, గోంగూరా, చీర కట్టు, వగైరా వగైరా మీరు చెప్పినవన్నీనూ అని మా మాట మాకే తిప్పి కొట్టారు. 

కానీ వీరంతా కూడా అమలాపురం వేద పండితులకి ప్రసిధ్ధి అన్న పాత కాలం గుఱించే వ్రాశారనిపిస్తున్నది. ప్రస్తుత కాలం తెలుగు వారి నానుడి, ‘అమలాపురం నుంచి అమీర్ పేట కి (software schools కి) అమీర్ పేట నుంచి అమెరికాకి’ (Amalapuram to Amir peta to America) అని మారి పోయిందీ అన్న పరివర్తన ఎవరూ గుర్తించలేదా అనిపించింది.

ఇక ఈ సంచికలోని మిగతా రచనలుః

సైనికులకి జోహారులర్పించారు మాధవి గారు.

        విజయలక్ష్మి గారు ‘crime doesn’t pay’ అన్న తమ నమ్మకం వెలిబుచ్చారు.

నిజంగా ఒక చందమామ కథ వ్రాశారు ప్రకాశ రావు గారు.

        భూమి తల్లి మట్టి తల్లి అని గానం చేశారు అంజయ్య గారు.

       తల్లి కడుపు అంటే ఏమిటో కథగా వ్రాశారు రోహిణి గారు.

        అంజయ్య గారు నిరంతర బాల్యపు వాన తుంపురులే జీవితమన్నారు.

నాగజ్యోతి శేఖర్ గారు దివ్యాంగుల జీవితాల గుఱించి బాగా వ్రాశారు.

వాణీ శ్రీనివాస్ గారు అతివేగంగా పరిగెడుతున్న కాలంలో పూజారి కుటుంబాల బాధలు వ్రాశారు.

రవికుమార్ గారు, రాఘవేంద్ర రావు గారు స్త్రీ గుఱించి surreal poems వ్రాశారా అనిపించింది.

తెలుగు రాష్ట్రాలలో ఈ వేసవిన మండిన ఎండలని తన చిత్రంలో బాగా చూపెట్టారు ఉమాకాంత్.

 

1 Comment