అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

2026 జనవరి 24న సంక్రాంతి సంబరాలు జరపడానికి నిశ్చయించి ఏర్పాట్లను మా కార్యవర్గ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. సంక్రాంతి సంబరాలు అంటే TFAS యువతీ యువకులకు వివిధ రకాలైన పోటీలలో పాల్గొనే అవకాశం. సభ్యులందరూ వారి కుటుంబాలతో పాల్గొని విజయవంతం చేయాలని నా విన్నపం.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

...ఎన్నాళ్ళుగానో, అంటే 1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ, ఒక ఏభై ఏళ్ళు, Sleeping Giant అనిపించుకున్న దేశం ఒక్క సారి నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుని ప్రపంచ దేశాలలో తన స్థానం ఏమిటో గమనించిందా అనిపిస్తుంది. ఇప్పుడు 'మన' వాళ్ళు ప్రకాశించని రంగం లేదు, పేరు తెచ్చుకోని దేశం లేదు....

పూర్తి కథనాన్ని వీక్షించండి

కొసరు (కవితలు)

వర్తమాన బాల్యం క్రమశిక్షణ వెనుక ఇంకా ఇంకా ఒదిగిపోతూనే ఉంది! కొసరించే వాడి ఆటల కొనసాగింపూ లేదు, కొసరికొసరి తినిపించే వ్యవధి అమ్మకీ లేదు!

పూర్తి కథనాన్ని వీక్షించండి

అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)

.. అతిసామాన్య ప్రజల నాలుకల మీద ఆడే మాటలే అచ్చతెనుగు అంటారు కొంతమంది. కాని, ఈ మాటల్లో పర్షియన్, ఉర్దూ, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి పదాల్ని కలిపి మాట్లాడుతూనే ఉన్నారు కదా! ఆ మేరకు అచ్చగా అచ్చతెనుగు రాయటం అంటే ముక్కాలి పీటమీద ఏనుగును  ఆటాడించినట్లే .

పూర్తి కథనాన్ని వీక్షించండి

ప్రేమ- పెళ్ళి (కథలు)

.. మన అమ్మమ్మల కాలం నుండి ప్రతి తరంలోనూ కట్నం సమస్య తీరిపోతుందనే అనుకున్నారుట. కానీ మిగతా దురాచారాల్లా దీన్ని నిర్ములించడం కుదరలేదు....

పూర్తి కథనాన్ని వీక్షించండి

చంచల మనసు (కవితలు)

...వగచితే ఫలితం శూన్యమని ఎంత తెలిసినా గాలికంటే వేగంగా సంచరించే మనసు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

అన్నపూర్ణమ్మ (కథలు)

.. "మనం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇప్పుడు కొంత మేరకు అన్నపూర్ణమ్మకి మనం చేదోడు కాగలం. ఇప్పుడైనా తన చేత మనం చిన్న హోటల్ పెట్టిస్తే బాగుంటుంది. తనంతట తాను నిలదొక్కుకోనిద్దాం" కదిపాను...

పూర్తి కథనాన్ని వీక్షించండి

పాహి మాం (కథలు)

.. అబ్బాయిగా నాకిలాంటి అభిప్రాయాలుంటే ఆశ్చర్యం లేదు. కానీ ఒక అమ్మాయి ఇవే అభిప్రాయాల్ని స్నేహితుడైన ఓ అబ్బాయితో పంచుకుని సమర్థించడం – ఇంచుమించు షాకింగే!......

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఒక్క క్షణం (కథలు)

.. “అంకుల్! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు ట్రైన్ ఎక్కినప్పటి నుండీ చూస్తున్నాను మీలో ఏదో కంగారు, అలజడీ. ఒక దగ్గర కూచోకుండా డోర్ దగ్గర నిలబడి దూకేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. నేనో అనాథను. అనాథాశ్రమంలో ఉంటున్నాను"...

పూర్తి కథనాన్ని వీక్షించండి

వైభవ వేంకటేశ! (కవితలు)

...సకల జీవుల నివ్విధి సాకునట్టి నీదు వైభవమది యెల్ల మాది గాదె?...

పూర్తి కథనాన్ని వీక్షించండి

నాటి భారతం (కవితలు)

నీతినియమాలు వీడని । నిమితగాళ్ళు           ధర్మమార్గంబు తప్పని । తక్కువారు.           ఎటను రఘురామ రాజ్యంబె । ఎంచిచూడ           ప్రకట గుణగణ భరిత! మా । భరతమాత

పూర్తి కథనాన్ని వీక్షించండి

మీరు ప్రవహించాలంటే……… (కవితలు)

...నిజ మానవుల్లో బ్రతుకు ప్రవహించాలంటే ముందు మీ ఊరెళ్ళాలి; దానితో సహవాసం చేసి రావాలి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఒక మందస్మిత గగనం కోసం (కవితలు)

...ఎండనక వాననక పిడుగుల పోట్లకు వెరవక ఏదీ యెదురుచూడక ఎదురొడ్డి నిలిచేదీ మనూరి చెట్టే మట్టిలో మట్టై ధూళిలో ధూళయి కలసిపోయి సమసిపోయేంత వరకూ నిలుస్తూ మట్టిని గట్టి చేసేది చెట్టే...

పూర్తి కథనాన్ని వీక్షించండి

వైద్యో నారాయణో హరి (కథలు)

....ఈ దేశపు పేద, దళిత కోటి ప్రజల హృదయాల నుండి స్రవించిన రక్తంతో పెంచబడి, విద్యాబుద్ధులు గడించి, వారి గురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ దేశద్రోహియే....

పూర్తి కథనాన్ని వీక్షించండి

వసుధైక కుటుంబం (కథలు)

...మన పెంపకంలో మన సంస్కృతిపాలు ఎక్కువగా ఉంటే మన పిల్లలు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా అది తాత్కాలికమే. ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

అడవి బిడ్డ.. (కథలు)

అడవిలింగాల, నల్లమడుగు, రాంపూర్, శాంతాపూర్, చద్మల్ తాండ, కల్ పోల్, బైరాపూర్ తాండ రూట్ మ్యాపు గిర్రున కళ్ళలో తిరిగింది. నా జ్ఞాపకాలు ముఫ్ఫై ఏళ్ళు వెనక్కి నెట్టబడ్డాయి. మార్పు అత్యంత సహజమేనంటూ..

పూర్తి కథనాన్ని వీక్షించండి

అడవి మల్లి (కథలు)

...“నా పేరు మల్లిక. ఈ ప్రాంతంలో చాలావరకు రకరకాల మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిని ఔషధంగా చేసి వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్జరీ అవసరం లేకుండా శరీర అవయవాలు సరిచేయవచ్చునట." ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

స్వయంకృతం (కథలు)

...శంకరం సంగతి విన్న దగ్గర నుండి మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయ్‌. కొడుకుల గురించి, కొడుకులు తెచ్చే కట్నం గురించి ఆలోచించటం శుద్ధ దండుగని శాస్త్రికి తెలుసు. స్వానుభవం అట్లాంటిది. కట్నం గురించి ఆలోచించటం కరెక్టుగాదని తన కొడుకు పెళ్ళిలోగాని శాస్త్రికి తెలిసి రాలేదు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

నల్లేరు మీద నడక (కథలు)

...ఆవిడ దగ్గర ఉన్న చివరి నగను అమ్మి నీ ఇంజీనీరింగు ఫీసు కట్టారు. ఇవన్నీ నీకు తెలియనివి కాదు. అలాంటిది ఇప్పుడు మామ్మను ఎక్కడికో పంపించడమేంటి? ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఉండిపోరాదే... ! (కథలు)

...మరో చినుకు … మరో చినుకు... ఒక దాని వెనక ఒకటి వస్తున్నయ్! తోసుకుంటున్నయ్ జారుడు బండ మీద!...

పూర్తి కథనాన్ని వీక్షించండి