TFAS ఉగాది సంబరాలు  (Author: TFAS కార్యవర్గం)

40 సంవత్సరాలు గా న్యూజెర్సీలో తెలుగు వారికి సేవలు చేస్తూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న న్యూ జెర్సీ తెలుగు కళా సమితి వారు ఏప్రిల్ 12 2025 న బ్రిడ్జి వాటర్ టెంపుల్ ఆడిటోరియం లో శ్రీ అన్నా మధు గారి అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలు ఉన్నత విలువలతో రమణీయంగా జరిగి, ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి.

ఉగాది సందర్భంగా 9 నృత్య కళాశాలల, 13 సంగీత కళాశాలల గురువులను సత్కరించి వారికి ఉగాది పురస్కారంతో సత్కరించడం  ఒక గౌరవనీయమైన కార్యక్రమం.  ఇండియా నుంచి వచ్చిన శ్రీ మాచిరాజు రాజేష్ కుమార్ గారు మండూక శబ్దం నాట్యంతో అందరిని అబ్బుర పరిచారు.  న్యూజెర్సీలోని వివిధ సంగీత, నృత్య కళాశాలలు తమ గాన, నృత్య, వాయిద్య ప్రదర్శనలతో ప్రజలను అలరించారు.  తెలుగు కళాసమితి కార్యవర్గ సభ్యులు 9 మంది ప్రదర్శించిన భువన విజయం అందరిని విస్మయపరిచి సంతోషానికి అవధులు లేకుండా చేసింది. ఉగాది వేడుకలుగా నిర్వహించిన వసంత శోభ, కవి సమ్మేళనం, పురుషుల ఫ్యాషన్ షో, హాస్య నాటికలు, జానపద నృత్యాలు, సినీ సంగీత నృత్య కార్యక్రమాలు అద్భుతమైన ప్రదర్శనలు. ప్రత్యేక సాహిత్య కార్యక్రమంగా నిర్వహించిన పోతన శ్రీనాధుడు రూపకం లో ంఆటా నాయకులు శ్రీ గనగోని శ్రీనివాస్, కిరణ్ దుడ్డగి గార్లు పద్య పఠనంతో విశేషంగా నిలిచారు.  శ్రీ కుమార్ రాణి, శ్రీమతి లలిత రాణి గార్లు, వందేమాతరం తరంగ్, మాళవిక ఆనంద్, చల్లా సృష్టికామరసు ధృతి, తమ్మా సమీరా, బొందుగుల అద్వైత్ తమ గానాలతో ఎన్నో పాటలు పాడి శ్రోతలను ఉర్రూతలూగించారు. శ్రీ రఘుశర్మ గారు పంచాంగ శ్రవణం చేసి ఉగాది ప్రాముఖ్యతను వివరించారు. M4M హీరొయిన్ జో శర్మ తన కొత్త చినెమ గురుంచ్ వివరాలను పంచుకోవదం ఒక ఫ్రత్యేక ఆకర్షణ.

ఉగాది పచ్చడి, ఉగాది విందు భోజనాలు అందరినీ ఆనంద డోలికలలో ముంచెత్తాయి.  శ్రీ ఉపేంద్ర చివుకుల గారు, TLCA NewYork  ఆధ్యక్షులు శ్రి సుమంత్ రామిసెట్టి మరియు ఎన్నో తెలుగు సంస్థల నుండి వచ్చిన ప్రతినిధులు అభినందించారు.  

ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చి ఈ వేడుకలను దిగ్విజయం చేసిన దాతలను కార్యవర్గ సభ్యులు శ్రీ అన్నా మధు, శ్రీ తాతా వెంకటసత్య , శ్రీ వూటుకూరు ప్రసాద్, శ్రీమతి కునిశెట్టి వాణి, శ్రీమతి మాదిశెట్టి లత, శ్రీ కంభంమెట్టుశేషగిరి, శ్రీ గిర్కల లోకేంద్ర, శ్రీమతి షకేలి అరుంధతి , శ్రీమతి వరలక్ష్మి శ్రీనివాస్ గార్లు సత్కరించారువాలంటీర్లకి సర్టిఫికెట్ అందజేశారు.  కార్యక్రమాలకు ఈ విధంగానే సహకరించి విజయం చేకూర్చాలని అధ్యక్షులు శ్రీ అన్నా మధు అభ్యర్థించారు.

0 Comments

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)