About Us

తెలుగు జ్యోతి న్యూజర్సీ తెలుగు కళా సమితి అనుబంధ పత్రిక. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి లోని సాహిత్య పిపాసకి ఒక వేదిక అందించి, తెలుగు రచనలకీ, కళలకీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావడమే మా లక్ష్యం. కుల, మత, జాతి బేధాలకి అతీతంగా, తెలుగు భాషా సేవయే  పరమార్ధంగా , తెలుగు కవుల, రచయితల సాహితీ సౌరభాన్ని, ఔన్నత్యాన్నీ విశ్వవ్యాప్తంగా పాఠకులకు అందించడం మా సంకల్పం.

1984 సంవత్సరం మొదలు తెలుగు కళాసమితి ఎన్నో రంగాలలో చేస్తున్న సేవలలో, తెలుగు జ్యోతి ఒకటి.  అంతర్జాలం లో  మా ఈ ప్రయత్నం, పాఠకుల మరియు సాహితీ వేత్తల సహకారంతో మున్ముందు ఎంతో అభివృద్ధి చెందుతుంది.  ఉన్నత సాహితీ విలువలతో బాటు, సాంకేతిక పరమైన మార్పులతో, మారుతున్న కాలానికి అనుగుణంగా, ఈ పత్రిక మీ ముందుంటుంది.

 

సదా మీ సహకారం, ప్రోత్సాహం కోరుకుంటూ

 

తెలుగు జ్యోతి సంపాదక వర్గం