సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్ (ప్రధాన సంపాదకులు))

కొన్ని సంవత్సరాల క్రితం ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలలో త్రివర్ణ పతాకంతో లోపలికి వస్తున్న నూట ఏభై మంది భారతీయుల జట్టును చూసి, ‘ఇన్ని కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక్క మెడల్ కూడా గెలుచుకోదెందుకో’ అని వాపోయాడో పాత్రికేయుడు. నిజమే కదా అనిపించింది.

ఓ ముప్ఫ్పయ్ ఐదేళ్ళ క్రితం ఈ దేశానికొచ్చినప్పుడు అద్దెకిళ్ళు వెతుకుతూ, నాకు ఫలానా చోట ఉద్యోగం అని చెప్తే, ‘మీ దేశస్తులంతా ఇంత తెలివి కల వాళ్ళు కదా, మీ దేశం అలా బీద పరిస్థితిలో ఎందుకుంటుందీ’ అని అడిగాడో పెద్ద మనిషి. దేశంలో చాలా మంది తిండీ గుడ్డా నీడకి (రోటీ కపడా మకాన్) కూడా నోచుకోలేని ఆ రోజుల్లో ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు.

ఆ పరిస్ఠితంతా Y2K సమస్యా పరిష్కారంతో మారిపోయిందని చెప్పచ్చు. ఇప్పుడటువంటి ప్రశ్నలకాస్కారం కూడా లేదు. బయటి వాళ్ళకే కాదు, మనమేమీ తక్కువ కాదు అన్న ఆత్మ గౌరవం సంపాదించుకున్నాం మనం. ‘ఏదేశమేగినా ఎందు కాలిడినా ….‘ మన ఖ్యాతి మనకన్నా ముందే అక్కడికి చేరుతుందనిపిస్తుంది.

అటువంటి నేపధ్యంలో చూడాలి దొమ్మరాజు గోకేశ్, గొంగటి తృష ల విజయాలు. వారిద్దరూ అంతర్జాతీయంగా ప్రఖ్యతులైతే, దీప్తి జీవన్జీ ది మరో రకమైన విజయం. ఆ అమ్మాయి గుఱించి చదివినప్పుడు, అమీర్ ఖాన్ తీసిన ఒక పాత హిందీ చిత్రం ‘తారే జమీన్ పే’ (Taaren Jamiin Pe) గుర్తుకొచ్చింది. క్రికెట్ కైతే కోట్లు ఖర్చు పెడ్తారు, మిగతావాటికన్నింటికీ కరావడి చుడ్తారు అన్న పరిస్థితి నుండి కూడా మనం బయట పడ్డామనిపిస్తుంది. ఈ విషయంలో ప్రఖ్యాత ఆంధ్రుడు పుల్లెల గోపీచంద్ గారు చేసిన సిఫారసు కూడా మనం గర్వించదగిన విషయం.

ఆ ముగ్గురు చిన్నారులకూ మా అభినందనలు.

ఈ ముగ్గురినీ చూపిస్తూ అందమైన ముఖ చిత్రం తయారు చేసిన పెద్ది ఉమాకాంత్ గారికి మా కృతజ్ఞతలు.

తెలుగుజ్యోతి 2025 సంక్రాంతి సంచిక సంక్రాంతి కి ఓ నెల తరువాత వెలువడ్తున్నా, అందంగా మంచి రచనలతో వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో, దాదాపు రెండు వందల రచనలు పంపిన రచయితలందఱికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

వచ్చిన కవితలన్నీ పరిశీలించడానికి మాకు సహాయ పడ్డ డా॥ వైదేహి గారికీ, సంచిక తయారు చేయడంలో అనేక  విధాలుగా సహాయపడిన శ్రీ శ్రీపతి మారుతి గారికీ మా కృతజ్ఞతలు.

0 Comments

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)