శోభాయమానంగా నూజెర్సీ లో సంగీత త్రిమూర్తి ఆరాధానోత్సవం  (Author: TFAS కార్యవర్గం)

మార్చి 1వ తేదీన somerset వడ్తాల్ ధామ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 15 సంగీత కళాశాలల నుండి విద్యార్థులు, విద్వాంసులు అలపించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసింది.  ఒక పక్క మంచు కురుస్తున్నా ఆలశ్యం లేకుండా చేరుకుని అందరు గురువులు, శిష్యులూ సంగీత త్రిమూర్తులైన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగరాజులకు ఆరాధనగా మృదంగ, వాయులీన, వీణా సహకారంతో ఆలపించిన ఘనరాగ పంచ కీర్తనలు, గణపతి మరియూ కామాక్షి అమ్మవారి పై కీర్తనలు సభికులను పరవశింప చేశాయి. 

ఈ కార్యక్రమంలో ముత్తుస్వామి కీర్తనల కచేరీ టెక్సాస్ నుండి విచ్చేసిన శ్రీమతి నైవేలి రామలక్ష్మి గారు అందించి అందరి మన్నలను పొందారు. 

శ్యామశాస్త్రి గారికి ఆరాధనగా శ్రీ ప్రకాశ రావు గారి ఆధ్వర్యంలో, శ్రీ అనంత రాయర్ గారి గాత్ర సహకారంతో జరిగిన తాళ వాద్య సమ్మేళనం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి, హాలు దద్దరిల్లేలా వారి కరతళధ్వనులతో మన్నలను పొందింది.  దీన్లో పాల్గొని ఇంత మంచి అంశాన్ని తయారుచేసిన గురువులు శ్రీ కుమార్ కందన్, శ్రీ దామోదర శ్రీనివాసన్, శ్రీ లక్ష్మి షా, మరియూ శ్రీ కీర్తి వెంకటరామన్ గార్లకి అభినందనలు మరియూ కృతజ్ఞతలు. 

న్యూజెర్సీ కి వన్నె తెచ్చే విదుషీమణి శ్రీమతి వేమూరి విజయలలిత గారు త్యాగరాజ ఆరాధనగా పాడిన కృతులు శ్రవణానందకరం.  అందరూ గురువులు, సభికులూ వేనోళ్ల విజయలలిత గారిని కొనియాడారు. 

త్రిమూర్తుల ఆరాధన లో పాల్గొన్న 400 మంది అతిథులకు శ్రీ నిమ్మా రవి గారు, శ్రీ గంటు శ్రీనివాస్ గార్లు తమ భోగ్ రెస్టారెంట్ ద్వారా పంపిన ఉపాహారం, భోజనాలు చవులూరించింది.  అలాగే ఆశ్చర్యపరుస్తూ దోశ పాలస్ శ్రీ రఘు గారు పంపిన ఉపాహారం కూడా అందరినీ ఆనందపరిచింది.

ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్నందించిన శ్రీ పోలేపల్లె శంకరరావు గారికి మా ధన్యవాదాలు. 

0 Comments