నీలో నువ్వు శోథిస్తే తప్ప
నీలో నువ్వు శోథిస్తే తప్ప (Author: చొక్కర తాతారావు)
నలుగురికీ చెప్పే ముందు
నువ్వేంటో తెలుసుకో
నీలోకి నువ్వు ప్రవహిస్తే తప్ప
నువ్వెవరో నీకు తెలియదు
లోలోకి వెళ్ళు
మనసు తాకి చూడు
సుఖదుఃఖాల జాడ తెలుస్తుంది
లోకాన్ని చూడు
నీ లోపాలు తెలుస్తాయి
మనసుని ప్రశ్నించు
అంతర్గతం బయటపడుతుంది
మనసు తేలిక పడుతుంది
నీలో నువ్వు వెతికితే తప్ప
నిజాలు బయటపడవు
నిజాలు వెంట నడిస్తే
నువ్వేంటో తెలుస్తుంది
నీతో నువ్వు నడిస్తే
ఆనందాలే కాదు
అనుభవాలూ దొరుకుతాయి
ఆనందాలు మనసుని,
అనుభవాలు
నీలో నిన్ను చూసుకో
బలాలు బలహీనతలు తెలుస్తాయి
నిన్ను నువ్వు ప్రశ్నించుకో
జవాబు దొరుకుతుంది
ఏదీ సుఖం కాదు
ఏదీ దుఃఖం కాదు
నీలో నువ్వు శోథిస్తే తప్ప
జీవితం అర్ధం కాదు