తెలుగు వెలుగు!
తెలుగు వెలుగు! (Author: కోరుకొండ లక్ష్మణరావు)
తెలుగు భాష వైభవం....
తెరమరుగయ్యింది!/
తెలుగు భాష సోయగం....
కనుమరుగయ్యింది !/
రాయల కొలువులో
రాణించిన తెలుగు/
అష్టదిగ్గజాల గంటముల
అలరారిన తెలుగు/
తేట తేట తెలుగు...
తేనెలొలుకు తెలుగు!/
తెలుగు భాష వైభవం..
తెరమరుగయ్యింది!/
తెలుగు భాష సోయగం... కనుమరుగయ్యింది!/
గ్రాంథిక భాషకు గ్రహణం పట్టింది!/
పరభాషా వ్యామోహంతో
తెలుగంటే అలుసయ్యింది!/
“అమ్మా నాన్” ల అచ్చతెలుగు
“మమ్మీ, డాడీ” ల రాకతో మసకబారింది!/
తెలుగు భాష వైభవం...
తెరమరుగయ్యింది!/
తెలుగు భాష సోయగం...
కనుమరుగయ్యింది!/
మారాలి మన ధృక్పధం!/
అమ్మ భాషకు అందలం
కావాలి మనందరికీ ఆదర్శం!/
ఉగ్గుపాలలో కలపాలండీ
మాతృభాష పై మమకారం!/
అధికార భాషగా
అలరారాలి తెలుగు!/
విద్యాబోధన మాధ్యమంగా
విలసిల్లాలి తెలుగు!/
తెలుగు సంఘానికి సాధికారత,
తెలుగు సాహిత్య వికాసానికి
సమధిక ప్రోత్సాహం
కావాలి ప్రభుత్వ ప్రాధమ్యాలు!/
అప్పుడే సాకారమౌతుంది
తెలుగు భాషకు పునర్వైభవం!