తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం

గంటకు సుమారు 25 మైళ్ళ వేగం తో ఈదురుగాలు తోడు రాగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో క్షణం ఆపకుండా పరిగెత్తిన చలిపులి ధాటికి భయభ్రాంతులై తమ తమ ఇళ్ళలోనే గృహ నిర్బంధంకాగా, తెలుగు కళా సమితి జనవరి లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు రద్దుచేయాల్సి వచ్చింది. న్యూ జెర్సీ గవర్నర్ ప్రకటించిన అత్యవసర పరిస్థితికి సహకరించడమే కాకుండా, పిల్లలకూ, పెద్దలకూ సౌకర్యం ఏర్పరిచిన ఈ నిర్ణయం సభ్యులందరి చేతా కొనయాడబడిందని తెలియజేస్తున్నాను.

మార్చి 7వ తేదీన జరిగిన త్రిమూర్తి ఆరాధన ఉత్సవ వేడుకలు ఆనంద మందిర్, సోమరిసెట్లో జరిగి విశేష మన్నలను అందుకున్నాయి. ఆరాధనకు న్యూ జెర్సీ సంగీత విద్వాన్సులందరూ కలిసి పాడిన త్యాగరాజ పంచ రత్న కృతులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.  న్యూ జెర్సీ నుంచే కాకుండా పెన్సిల్వేనియా, టెక్సాస్ రాష్ట్రాల నుండి వచ్చిన విదుషీమణులు కూడా ఈ కార్యక్రమంలో త్రిమూర్తుల రచనలను మన ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమంలో ఒక విశేషం. ఎన్నో సంగీత కళాశాలల శిష్యులు కూడా త్రిమూర్తి కృతులను శ్రావ్యంగా శృతిలయలతో పాడి అందరి ఆదరణను పొందారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన పోలేపల్లి శంకర్ రావు గారు, సావిత్రి గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఏప్రిల్ 12న ఏర్పాటు చేస్తున్న ఉగాది వేడుకలకు మా కార్యవర్గం ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నది. ఈ వేడుకలలో తెలుగు కళా సమితి తో స్నేహపూర్వక సంబంధాలతో కార్యక్రమాలు నిర్వహించటానికి తమ వంతు సహకారం అందిస్తున్న సంగీత నృత్య కళాశాలలకు ఉగాది పురస్కారాలు అందజేస్తున్నామని సవినయంగా తెలియజేస్తున్నాను.

మరొక సంతోషకరమైన విషయం. మన శ్రేయోభిలాషులు, సినీ సంగీత దర్శకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, మధుర స్వర కామాక్షి, రచయిత బాలమురళి శ్రీ వీణాపాణి రమణమూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళా రత్న బిరుదు పరదానం చేసినందుకు మనసారా సంతోషిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. వీరు మన ఉగాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం ఒక విశేషం. 

పలుమార్లు చెప్పిన విధంగా మన కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి అంటే మా కార్యవర్గ సభ్యుల సహకారం కృషి ఎంతో ప్రశంసనీయం. సభ్యుల సహకారం కూడా మా వెన్నంటే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది.

సభ్యుల, దాతల విరాళాలతో కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం సులభం. మరొక్కసారి మిమ్మల్ని విరాళాలతో సహకరిస్తూ రాబోయే ఉగాది వేడుకలు ఆనందంగా, విజయవంతం చేయాలని నా విజ్ఞప్తి, ప్రార్థన.

 మీ 

మధు అన్న

0 Comments

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)