జయ వందేమాతరం  (Author: పాలూరి సుజన)

సంగీతం, గానం: శ్రీమతి రమా కౌసల్య మనోహర్ (Bangalore , India )
[ లంకె మీద నొక్కి పాట మచ్చు తునక వినండి !]

శాంతి, సహనం జగతిని భారత్ కే సాధ్యం!

శతాబ్దాలు చేసింది దేశమాత దాస్యం!

కోహినూరు కొల్లగొట్టె తెల్లవారి స్వార్థం!

రత్నగర్భ మా తల్లికి మిగిలె మిగుల శోకం!

ఆమె దుఃఖ మాక్రోశం పెంచె ప్రజల ఆవేశం!

సుస్వరాజ్య ఉద్యమానికదే కదా ఆరంభం!

ఉరి కొయ్యల ఊయలూగ భగత్ సింగులొచ్చినారు!

గుండు కెదురు గుండె నొడ్డి రామరాజు నిలిచినారు!

అహింసయే ఆయుధమై మహాత్ముడే అడుగేసెను!

పటేల్, బోసు, ఝాన్సిరాణి సింహాలై గర్జించెను!

బానిస సంకెళ్ళు త్రుంచి తెచ్చె మనకు స్వాతంత్ర్యం!

ప్రాణాలను పెట్టి పణం, తీర్చుకొనిరి అమ్మ ఋణం!

సాయుధ సంగ్రామంలో త్యాగం శూరుల రుధిరం!

సత్యాగ్రహ సత్పథాన శుభ్రజ్యోత్స్నా శ్వేతం!

సస్యశ్యామల సేద్యపు రైతుల స్వేదం హరితం!

మువ్వన్నెల దివ్వె వెలుగు వందేమాతర గీతం!

నాలుగు సింహాల ధర్మ విక్రమ మశోక చక్రం

మామిడి, నెమలి, కమలం, పులులు గర్వ చిహ్నం!

ఎన్ని మతాలెన్ని రీతులెన్ని భాషలున్నా,

హిమవన్నగ సన్నుతేల, ఉన్నతి మిన్నంటిపోవ!

జీవనదీ జలనిధులే  సంగమించు జలధులన్ని

భరతమాత జలతారు చీర చెంగు పరవళ్ళే!

బుద్ధుడు, నానక్, జైనుల బోధలకే ఆధారం!

నమస్కార సంస్కారం నా దేశపు సత్కారం!

యోగాయేనా? జగతికి  ఓంకారం నా  దేశం!

రంగం ఏదైన గాని పారంగతులకు తీరం!

నింగి కెగసి పోలేదా, మంగళ గ్రహమా దూరం?

పట్టుదలతో పని చేద్దాం! ప్రగతిబాట సాగుదాం!

గణతంత్రపు వీణలపై ఘన ప్రణతుల నిక్వణం!

జన గళమున గణగణమను జనగణమన గానం!

జయ జయ జయహే నాదం నినదించే జనం మనం!

జయ జయ జయహే నాదం జయ వందేమాతరం!

0 Comments

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)