ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (Author: TFAS kaaryavargam)
తెలుగు కళా సమితి స్వామి నారాయణ మందిరం న్యూజెర్సీలో 2026 జనవరి 24 శనివారం నిర్వహించిన సంక్రాంతి వేడుకలు, పాల్గొన్న సభ్యులను, ప్రేక్షకులనూ, అతిధులను, కళాకారులను ఆనందమైన వేడుకలతో ముంచెత్తాయి. తెలుగు సంస్కృతి, భాషా తెలుగు భాషాప్రోత్సాహోద్దేశ్యంతో జరిపే సంక్రాంతి వేడుకల వివరాలు శ్రీ అన్నామధు గారు తెలియజేయడంతో ప్రారంభమై, వైవిధ్యం కల అంశాలతో కొనసాగింది. TFAS ప్రతి సంవత్సరం యువతలో నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించడానికి యువత చేతే నిర్వహించేటట్లు ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది యువ వాలంటీర్లు వ్యాఖ్యాతలుగా, కార్యక్రమనిర్వాహకులుగా, సహాయకారులుగా పని చేసి దిగ్విజయం చెయ్యడం గర్వకారణం.
ఈ వేడుకలను శ్రీమతి ఉషా దర్శిపూడి, శ్రీ తాతా వెంకట సత్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు భాష పోటీలలో ఎంతో మంది బాలబాలికలు యువతీ యువకులు పాల్గొని, వారికి తెలుగు మీద ఉన్న మక్కువను వ్యక్తపరచడం తెలుగు వారికి గర్వకారణం.
శ్రీమతి అరుంధతి షకేల్లి గారి ఆధ్వర్యంలో జరిగిన పెళ్ళిసందడి కార్యక్రమంలో సుమారు 35 మంది యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం చాలా చక్కగా మర్యాదపూర్వకంగా జరిగిందని మళ్లీమళ్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సభ్యులు కోరడం ఒక సంతోషకరమైన విషయం
వేదికమీద ప్రేక్షకులందరూ చూసేలా మంత్ర పఠనంతో సంక్రాంతి పొంగలి వండి చూపిన దృశ్యం అందరినీ ఆనందంలో ముంచెత్తింది. వేదికమీద TFAS చరిత్ర లో మొట్టమొదటి సారిగా నిజమైన గోమయంతో చేసిన గొబ్బెమ్మలకు పూజచేసి గొబ్బి పాటలతో, నృత్యాలతో వేడుకగా జరిపిన తీరు ప్రేక్షకుల హర్షధ్వానాలనందుకొంది! సుమారు 70 మంది మహిళలు గొబ్బెమ్మల పూజా వేడుకల్లో పాల్గొని తమ తమ మాతృభూమిలో జరుపుకునే విధానాన్ని గుర్తుచేసుకుంటూ పాల్గొని ఎంతో వన్నె తెచ్చారు. ఈ కార్యక్రమానికి సంగీత సహకారం అందించిన శ్రీ కంభంమెట్టు గిరి గారు అందరి మెప్పూ పొందారు.
సంక్రాంతి గురించి ప్రదర్శించిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది వీడియో తయారు చేసిన చిరంజీవి గొల్లా శిరీష్ ని ప్రజలు ప్రశంసించారు. ముగ్గులు, చిత్రలేఖనం మరియూ ఇతర పోటీలు; యువతీ యువకులు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలలో విజేతలందరికీ బహుమతులు అందజేయడం జరిగింది.
TFAS యువజన వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి మాడిశెట్టి లత గారికీ, వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించదానికి సహకారం అందించిన యువ వాలంటీర్లకి కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు. పోటీలకు సహకరించిన ఎంతోమంది న్యాయనిర్ణేతలను కార్యవర్గ సభ్యులు సత్కరించారు.
వైస్ ప్రెసిడెంట్, శ్రీ వూటుకూరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి విందు భోజనం ఏర్పాటు చేసిన తీరు ఎంతో ప్రశంసనీయం. శ్రీమతి వాణి కూనిశెట్టి, శ్రీ లోకేందర్ గిరకల, శ్రీమతి వరలక్ష్మీ శ్రీనివాస్ గార్లు తమ తమ కార్యవర్గ బాధ్యతను చక్కగా నిర్వహించి వేడుకలు విజయవంతం చేశారు.
శ్రీ ఉపేంద్ర చివుకుల గారు, శ్రీ రఘు శర్మ శంకరమంచి గారు అతిథులుగా విచ్చేసి వేడుకలకు ఒక ప్రత్యేక శోభను తెచ్చారు. వేడుకల్లో శ్రీ TP రావు గారు, శ్రీ గేదెల దాము గారూ, శ్రీ మతి దేవులపల్లి సుధ గారు, శ్రీ ఉప్పల సుధాకర్ గారు, శ్రీ అన్నదానం రవి గారు, శ్రీమతి మాదిరాజు బిందు గారు, శ్రీ తమ్మా శ్రీనివాస రావు గారు, శ్రీ జంబూల విలాస రెడ్డి గారు, శ్రీమతి దశిక శ్యామల గారు మరియూ ఇంకా ఎంతో మంది పెద్దలు పాల్గొన్నారు.
ఎముకలు కొరికే చలిని ఎదిరించి, ఊహించని రీతిలో సుమారు 400 మంది పాల్గొన్న ఈ వేడుక అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు శ్రీ అన్నా మధు గారు ధన్యవాదాలు తెలియజేశారు.
జై తెలుగు! జై అమెరికా!! జై హింద్!!!
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)