ఆత్మీయత సిరులు  (Author: కొమురవెల్లి అంజయ్య)

వయసును మరిచిపో
పెద్దరికాలు, గొప్పలు వదిలేయి
చిన్నారుల్లో కలిసిపో
ఆటలో ఆటవై
మాటల్లో మాటవై
చిలిపితనంలో చిత్రాంగివికా
కోల్పోయిన నిండైన నవ్వు
చిగురిస్తుంది శరీరమంతా

పల్లె పిల్లల
చిర్రగోనెవో, గోటీలాటవో
సిగరెట్ పత్తాలాటవో,  తొక్కుడు బిల్లవో
పుంజీతానివో అయిపో
మట్టి వాసన చర్మంలోకి ఇంకుతుంది
పువ్వు సహజంగా వికసించడం
తెలిసొస్తుంది, తెలివొస్తుంది

ఇంటి ముందర అరుగుమీద
పిచ్చాపాటిలో మాటల తేనె కలుపు
ఊరంతా అక్కడికి దిగొస్తుంది
లోక జ్ఞానం బొట్టు నుదుటికి అంటుకుంటుంది

అనాధాశ్రమం, వృద్ధాశ్రమాలలో
రోజంతా కుదువ పెట్టు
మనసుల వాసనలు పీల్చడమే పనిగా పెట్టుకో
జీవితమంటే రూపాయి కాదని
ఆప్తులు లేని ఆస్తులు
పగిలే మట్టిబొమ్మ లేనని
బుద్ధి వికసిస్తుంది

మట్టి వాసన, వాన
వెలుతురు, గాలి చొరబడని
అద్దాల భవనాల్లో
గోడ కోటలు కట్టుకొని మురిసిపోతే
యంత్రాల మధ్య యంత్రంగా మారితే
దక్కవు ఆత్మీయతా సిరులు
వెతికి వెతికి వేసారి పోవడమే

కిందకి దిగడం
పైకి ఎగరడం రెండూ తెలియాలి
భూమి పొరల్లోనే బంధాలు, అనుబంధాలు
కలగలిపి ఉంటాయి ఎరువులా
భూమి తల్లిలా మనం మారితేనే
ఆత్మీయత శ్వాస ఆడుతుంది

అసలు, వడ్డీ, చక్ర వడ్డీ ఆశించకుండా
ఆత్మీయత అందరికీ పంచుతూపో
జీవితం ఎడారి అనుకున్నప్పుడు
చల్లని నీటి కుండలా ఎదురొస్తుంది
దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు
మానవత్వం చెరువులో ఈత కొట్టిస్తుంది

1 Comment

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)