అధ్యక్షుని సందేశం

తెలుగు సమితి సభ్యులందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు.

మా 2024- 26 కార్యవర్గం రెండు సంవత్సరాల పదవీ బాధ్యతల మొదటి సంవత్సరం దిగ్వితీయంగా పూర్తి చేసి; రెండో సంవత్సరం మన కార్యక్రమాలను వినూత్నంగా, ఆకర్షణీయంగా, విలువలతో ప్రణాళికలు రచించి సఫలీకృతులమవుతున్నాము. మొట్టమొదటి సారిగా Pickle Ball పోటీలు నిర్వహించి అందరి మనలను పొందాము. Picnic ని జూలై 20 వ తారీకున Hawaian theme లో ఏర్పరిచి సభ్యుల ఆదరణలను ప్రశంసలను పొందాము. ప్రతి సంవత్సరం జరుపుకునే దీపావళి వేడుకలను నూతన పద్ధతిలో ఆకర్షణీయంగా ఉండాలని, బాహ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసి జాతర పేరిట అతి వైభవంగా జరిపాము. సెప్టెంబర్ 20న సూర్యరశ్మిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలను మన సభ్యులు మరియు ఇతర సంస్థల సభ్యులను ఆనందంలో ముంచెత్తి, ఆశ్చర్యాన్ని గురిచేశాయి. తెలుగువారి కార్యక్రమాలు outdoor లో కూడా దిగ్విజయంగా చేయవచ్చని దారి చూపిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. దీపావళి వేడుకల సందర్భంగా జరిగిన సంగీత నృత్య వైద్య పోటీలు, స్త్రీల క్రికెట్ పోటీలు బహుముఖ ప్రశంసలు పొందాయి. గెలిచిన విజేతలకు బహుమతులు జాతర వేడుకల్లో అందజేయబడ్డాయి.  అన్నట్లు ప్రతి సంవత్సరం జరిగే క్రికెట్ పోటీలకు అనూహ్యంగా 24 టీములు పోటీ పడుతున్నాయి పోటీలు ప్రస్తుతం దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి

2024 సంవత్సరంలో TFASకి సేవలందించిన 15 మంది యువ కార్యకర్తలకు PVSA అవార్డులు దీపావళి జాతర వేడుక వేదిక మీద పుర ప్రముఖులు, తెలుగు సంస్థల నాయకుల చేతుల మీదుగా అందజేసే యూత్ వాలంటీర్ల సంతోషాన్ని, ఆనందాన్ని తృప్తిగా పొందాము. దీపావళి జాతర వేడుకలు ఉద్దేశంతో ఏర్పాటు చేసిన హరికథ, బుర్రకథ, పౌరాణిక నాటకం, జానపద గీతాలు, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, బోనాలు, పులి వేషం, పోతరాజు వంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగు కళా సమితికి కళలపట్ల ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని ప్రతిబింపచేశాయి. జానపద గాయనీ గాయకులు, సినీ సంగీత గాయనీ గాయకులు, స్థానిక గాయనీ గాయకులతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఉత్సాహమైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి ఈలలూ చప్పట్లు మారుమోగాయి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన పెద్దలు, అడ్వైజర్స్, కార్యవర్గ సభ్యులకు మనసారా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమ నిర్వహణకు విరాళాలు ఇచ్చి సహాయాన్ని అందజేసిన ప్రతి ఒక్క దాతకూ కార్యవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కార్యక్రమాలకు సహకారాన్ని అర్థిస్తూ మమ్మల్ని అభిమానంతో ముందుకు నడిపించాలని ప్రార్థన.

మీ,

అన్నా మధు.

0 Comments