మాయ చేప  (Author: డి. నిటలాక్ష రామ)

అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ ఇంటి ప్రక్కన ఒక చెఱువు ఉంది. ఒక రోజు... ఆ చెఱువులో ఆ పిల్లవాడు స్విమ్మింగ్ చేస్తుండగా ఒక చిన్న చేప తనకి అడ్డు పడుతూ ఉంది. ఆ చేప భలే ముద్దుగా ఉందే! అని దానిని ఇంటికి తెచ్చుకుని ఆక్వేరియం లో వేసి పెంచుకుంటున్నాడు.  

ఒక రోజు రాత్రి వాళ్ళింటికి ఒక దొంగ వచ్చాడు. ఇంతలో చీకటిలో ఉన్న దొంగ మీదకి ఒక లైట్ పడింది. చుట్టూ చూస్తే లైట్లన్నీ ఆపేసి ఉన్నాయి అయినా లైట్ ఎక్కడనుండి వస్తోందా అని గమనిస్తే ఆ లైట్ చేప నుండి వచ్చింది. అది చూసిన దొంగ ఇదేదో మాయా చేపలా ఉందే! ఈ చేపని దొంగిలిద్దామని ఆక్వేరియం నుండి తీశాడు.  

ఇంతలో వాళ్ళ పక్కింట్లో ఉన్న నిటలాక్ష రామ కి ఏవో శబ్దాలు వినిపించి ఈ చిన్నపిల్లాడింటికి వచ్చి ఆ దొంగోడిని బాగా కొట్టి చేపను కాపాడి, తిరిగి ఆక్వేరియంలో వేశాడు. ఈ గొడవకి నిద్రలేచిన చిన్న పిల్లాడు నిటాలాక్ష రామ కి థాంక్స్ చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యంగా ఆ చేప నేను నిటలాక్ష రామతోనే ఉంటానని చెప్పింది. దానికి ఆ చిన్నపిల్లాడు కూడా ఒప్పుకుని సంతోషంగా చేపను నిటాలాక్ష రామకి ఇచ్చాడు.  

ఆ చేపను తెచ్చి నిటలాక్ష రామ వాళ్ళింట్లో ఆక్వేరియం లో వేసి పడుకున్నాడు. పొద్దున్న లేచి చూడగా ఆక్వేరియంలో బంగారం ఉంది. చూసి ఆశ్చర్యపోయిన నిటలాక్ష రామ తో ఆ చేప "నేనొక మాయా చేపను, నాకు నిస్వార్ధంగా సహాయం చేసిన వాళ్ళకి నేనిలా నెలకోసారి 4 బారువుల బంగారం ఇస్తాను" అని చెప్పింది.  

ఆ బంగారంతో నిటలాక్ష రామ.. పని చేసుకుని బ్రతికే చిన్న పిల్లలు చదువుకోడానికి స్కూల్స్, డాక్టర్స్ కూడా లేని పల్లెటూళ్ళలో హాస్పిటల్స్ కట్టించడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. తాను మాత్రం తన సంపాదనతో హాయిగా బ్రతుకుతున్నాడు.   

Comentar