రైతు మిత్రుల కథ  (Author: చి|| పి. సాయి యువన్)

ఒకప్పుడు ఒక రైతు ఉండే వాడు. ఆ రైతుకి ముగ్గురు మిత్రులు ఉండే వారు. వాళ్ళు అందరూ కలిసి కష్టపడి పంటలు పండించే వారు. వాళ్ళు రోజూ అలా కలిసి మెలిసి పని చేయడం వల్ల వాళ్ళు చాలా కూరగాయలు పండించేవాళ్ళు. అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు.

ఒక రోజు ఆ రైతు పొలంలోకి ఒక పెద్ద పులి వచ్చింది. అది అక్కడ పని చేసేవాళ్లను తినేసి, పంటని మొత్తం పాడుచేస్తుంటే ఆ రైతు మిత్రులు దాన్ని తరిమికొట్టారు.

ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరోజు మళ్ళీ ఆ పులి వచ్చి  తినేస్తుంటే... అక్కడికి ఒక సింహం వచ్చింది. ఆ సింహం రైతు మిత్రులకు ఫ్రెండ్. అది ఆ పులి పొలంలోకి వచ్చినందుకు దాన్ని వెంటాడి చంపి తినేసింది.

తన మిత్రులు చేసిన సహాయానికి ఆ రైతు చాలా సంతోషించాడు. మళ్ళీ హాయిగా కూరగాయలు పండించుకున్నాడు. ఆ రైతు వాళ్ళ మిత్రులతో ఆనందంగా ఉన్నాడు. కొన్ని రోజులైనాకా ఆ రైతు కొంచం పెద్దగా అయ్యాడు. ఇంకా కొన్ని రోజుల తరువాత ఇంకా పెద్దగా అయ్యాడు. ఆ తర్వాత చాల రోజులైనాకా ముసలిగా అయిపోయాడు. ఆ రైతుతో పాటు తన ముగ్గురు మిత్రులు కూడా ముసలిగా అయిపోయారు. వాళ్ళకి వాళ్ళ పంటను పండించడానికి బలం లేక చాలా కష్టపడేవాళ్ళు.

ఆ రైతుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. రైతు మిత్రులు కష్టాల్లో ఉన్నారని వాళ్లకు తెలిసింది. ఒకప్పుడు వాళ్ళ నాన్నని పులి నుంచి కాపాడి సహాయం చేసింది గుర్తొచ్చింది.

ఆ రైతు వాళ్ళ ఇద్దరు కొడుకులు, ఆ రైతు మిత్రులు ముగ్గురి పొలాల్లో రోజూ పని చేశారు. చాలా కూరగాయలు పండించారు. అప్పుడు చాలా డబ్బులు వచ్చాయి. ఆ ముగ్గురు మిత్రులు ఆ రైతు వాళ్ళ కొడుకులు చేసిన సహాయానికి చాలా ఆనందించారు.

ఆ తర్వాత అందరూ సంతోషంగా కలిసి మెలిసి ఉన్నారు.

ఈ కథలో నీతి ఏంటంటే... మనం ఒకరికి సహాయం చేస్తే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మనకి కూడా సహాయం చేస్తారు.

0 hozzászólás