నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ!  (Author: పి.వి.శేషారత్నం)

ఈమధ్య  ఎందుకో తెలియదుగానీ

సుగమ సంగీత సరళిలో సాగిపోయే మన వందేమాతర గీతం

పదేపదే గుర్తొచ్చి నా హృదయం స్పందించిపోతోంది.

నా అన్నదమ్ముల సమైక్యత... గుండెధైర్యం... తెగింపు...

కర్తవ్యస్ఫురణ గుర్తొచ్చి మనసు ఆనండోలికలూగిపోతోంది.

‘అమ్మా’ అనే ఊహతెలియని నా తొలి పిలుపుకి

‘నా బంగారు చిన్నా’ అంటూ పరవశించి ముద్దులుకురిపించిన

అమ్మ భారతివి నువ్వే అనుక్షణం గుర్తొస్తున్నావు.

 

ఆటల్లో దెబ్బతిని ఆర్తితో ‘అమ్మా’ అనగానే

గోదావరి గలగలలతో కృష్ణవేణి పరుగులతో

నాగావళి సరిగమల ఉరుకులతో వచ్చి సేదదీర్చిన మహాతల్లివి!

నా హృదయఘోష  నీకు వినిపిస్తోంది కదమ్మా!

 

స్వప్నసాకారతకు వలసబోయానేగానీ, నేటికీ

నా నవనాడులలో నెత్తురుగా పారేది నీ అమ్మదనమేనమ్మా భారతీ!

అందుకే తరతరాల నీ లాలిపాట తీపి జ్ఞాపకాలను రేపుతోంటే

నీ వెచ్చని ఒడిలో మళ్లీ హాయిగా  ఒదగాలని వుంది.

నీ చల్లని ఎదపై ఆదమరచి నిదరోవాలని ఎంతెంతో ఆశగా ఉంది.

నీబంగరు చేతులలో మళ్లీ ఊయలలూగాలని వుంది.

నీమాతృప్రేమా లహరిలో తనివితీరా ఓలలాడాలనివుంది.

 

ఏ చీకూచింతాలేని ఆనాటి బ్రతుకును తిరిగి పొందాలని వుంది.

బ్రతుకు పరుగుపందాలలో అలసిపోయి జీవిత పోరాటాలతో విసుగెత్తిపోయి

అలసిసొలసి మన జీవగడ్డకు తిరిగి వస్తున్నానమ్మా!

 

ఇన్నాళ్లూ తల్లిని మరిచిపోయాడని అలగక

వలసబోయిన బిడ్డడని నెపమెంచక

నా ఆర్తిలోని తపనను గుర్తించి మళ్లీ నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ!

******

0 hozzászólás

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)