ఒక్క రోజు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే....
ఒక్క రోజు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే.... (Author: దాసరి మోహన్)
"ఇప్పుడు... రాష్ట్ర ఉత్తమ రైతు శ్రీ బాలాజీ సేట్ ను మన జిల్లా కలెక్టరు గారు సన్మానం చేస్తారు, బాలాజీ సేట్ సభ పైకి రావలసిందిగా కోరుతున్నాను" అని సభ అధ్యక్షుడు సర్పంచ్ అనగానే, బాలాజీ సేట్ సభ పైకి వచ్చిఅందరికీ నమస్కారం చేశాడు.
కలెక్టరు గారు మైకు తీసుకుని... "డిగ్రీ చదువు కున్న... వారసత్వ వ్యాపార కుటుంబానికి చెందిన కూడా, వ్యవసాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన బాలాజీ గారిని అభినందించుస్తున్నా. ప్రభుత్వ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.
కలెక్టరు మరియు సర్పంచ్ కలిసి బాలాజీ సేట్ ను సత్కరించారు.
సత్కారము తరువాత, " మిమ్మల్ని అందరూ బాలాజీ సేట్ అంటున్నారు, మీరు రైతు ఎలా అయ్యా రు అని కలెక్టరు గారు అడిగారు.
"అదో పెద్ద కథ సార్" అన్నాడు బాలాజీ.
"ఓహ్ పెద్ద కథనా, అయితే కారులో వరంగల్ వరకు నాతో ప్రయత్నిస్తు చెబుదురు.. నాతో కార్లో రండి"అని తీసుకు వెళ్లారు.
* * *
బాలాజీ చిట్ ఫండ్ ఆఫీసు ముందు జనం గుమి గూడారు.. సమయం ఉదయం పది దాటినా ఆఫీసు తెరవ లేదు..
"ఇంకా తెరవ లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది" అన్నాడు ఒకడు అసహనం తో.
"నేను నిన్నటి నుండి ట్రై చేస్తున్న..... ఫోన్ ఆఫ్ వస్తుంది" మరొకరు.
"ఈ రోజు చిట్టి డబ్బులు ఇవ్వాలి.. అందుకే ఆఫ్ చేశా డేమో" మరొకరి అనుమానం నాటాడు.
"నాకూ డబ్బులు ఇవ్వాలి.... ఆఫీసు తెరవ లేదు అని ఇంటికి వెళ్లి చూశా.. తాళం వేసి వుంది" నీళ్లు పోసా డు అప్పుడే అక్కడికి వచ్చిన ఇంకొకతను.
"మోస పోయాo బ్రదర్.. అందరి లాగే, వీడు కూడ చిట్ ఫండ్ కంపెనీ ఎత్తి వేశాడు. మన పైసలు ఇక పోయినట్టె" ఏక వాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టి గందరగోళం సృష్టించాడు మొదటి వాడు.
"మంచిగా మాట్లాడడం.. నమ్మకం కుదర్చ డం... ఫైనాన్స్ పెట్టడం... డబ్బులు జమ కాగానే బిచానా ఎత్తి వేయడం.. ఇంతే..." బిజినెస్ ఫార్ములా ను విప్పి చెప్పాడు మరోకరు.
ఇంతలో అక్కడికి మరి కొందరు చేరుకున్నారు..
అందులో ఒకతను "ఇందుకోనేమో... పాత ఇల్లు అమ్మేసాడు" చల్లగా చెప్పాడు.
" అవునా... అంతా ప్లాన్ గా చేశాడు అన్న మాట, జత కలిపారు కొందరు.
"ఎమ్ చేస్తాo.... షట్టర్ పగులగొట్టి చూద్దాం... లోపాల మన ఇంటి పేపర్ లు వున్నాయో... అవి కూడ పట్టుకు పోయాడో".
ఇంటి పేపర్ అనే సరికి అందరికీ కోపం కట్టలు తెంచు కుంది.. పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి షట్టర్ పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.. ఎవరి స్యూరిటీ పేపర్ లు వాళ్లు వెతికి తీసుకున్నారు. కొందరు క్యాష్ బాక్స్ లోని డబ్బులు తీసుకున్నారు.
ఇంతలో ఆఫీసు కు వచ్చిన మేనేజర్... ఆఫీసు ఓపెన్ చేయకుండానే లోపల జనం వుండడం ఆశ్చర్యానికి గురి అయ్యాడు. మెల్లిగా లోపలికి వచ్చాడు. రాగానే కొందరు మేనేజర్ ను పట్టుకున్నారు.
"ఎక్కడికి పోయాడురా మీ సేట్" ఒకరు
"తిరుపతి వెళ్లారు.. మీరు ఎలా ఆఫీసు లో దూరారు.. ఆ పేపర్ లు ఎందుకు తీసుకున్నారు.."
"నాటకం ఆడకురా.. అంతా ప్లాన్ గానే చేసి ఏమీ తెలియనట్లు నటిస్తున్నావా. రోజు. ఆఫీసుకు పన్నెండు గంటలకు వస్తావా" మరొకరు
"లేదు.. ఈ రోజు లేట్ అయ్యింది. సెట్ కూడ లేడు కదా అందుకే తొందరగా ఆఫీసు తీయలేదు.." అన్నాడు మేనేజర్.
"వీళ్లందరు నాటకాలు అడి మనలను మోసం చేస్తున్నారు.. తన్నిoడి నా కొడుకును" ఒకడు అరవ గానే అందరూ మేనేజర్ పై పడి కొట్టారు.
మరికొందరు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. మనుషులలో ఎంత అసహనం విద్వేషం వుందో, ఎంతగా విధ్వంసం సృష్టిస్తారో... ఇక్కడి దృశ్యం చెబుతుంది.
"మా పైసలు మాకు రాకుంటే చంపుతం అని చెప్పు.. మీ సేట్ కు" అని వార్నింగ్ ఇస్తూ వెళ్లారు..
వార్త వేగంగా వూరు అంతా వ్యాపించింది. మిత్రులు బంధువులు టివి లో కన్నా ఎక్కువ చర్చలు చేశారు. ఒక్కొక్కరు తమ కామెంట్స్ తో తమ ( అ) జ్ఞానం ప్రదర్శించారు. ఎవరు ఎవరికి ఎంత డబ్బులు రావాలో, వారి భాషలో ఎంత మోస పోయామో లెక్కలు వేసు కున్నారు. కొందరు ఎలా రాబట్టు కోవాలని ఆలోచిస్తే, మరి కొందరు బాలాజీ సేట్ ను పగ వానిగా చేసి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తున్నారు
సినిమాలోనివి సీరియల్ లోని సన్నివేశాలు అన్ని వూహించుకొని కథలు కథలు గా ప్రచారం చేస్తున్నారు.
దగ్గరి బంధువులు మరింత లోతుగా ఆలోచించి బాలాజీ
ఇంటి దగ్గరికి ఒకరికి తెలియకుండా మరొకరు చేరుకుని చేతి వాటం ప్రదర్శించారు.
ఎవరికి తోచినట్టు వారు, అందరూ మేధావితనం ప్రదర్శిస్తూ చేయాల్సిన నష్టం చేస్తున్నారు. ఒక్కరూ మనిషి గా ఆలోచించడం లేదు. బహుశా మనం మళ్లీ అనాగరికులo అవుతున్నావేమో.
* * *
అర్ద రాత్రి ఇంటికి చేరుకున్న బాలాజీ, ఇంటి తలుపులు పగులగొట్టి వుండే సరికి అనుమానముగా, ఇంట్లోకి తొంగి చూశాడు.. హాల్ లోని టివి కనపడలేదు.. దొంగతనం జరిగిందని భావించి కార్ ను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లాడు.
పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాలాజీ సెట్ కు మరో ఆశ్చర్యం కనపడింది.. తన ఫైనాన్స్ మేనేజర్ సెల్ లో కనిపించాడు. మేనేజర్ ఏడుస్తు మార్నింగ్ ఆఫీసులో జరిగింది, తనను బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చింది చెప్పాడు.
ఇంతలో, 'బాలాజీ సేట్ వచ్చాడు'అని కానిస్టేబుల్ ఫోన్ చేస్తే స్టేషన్ కు ఎస్ ఐ వచ్చారు.
"ఎంది సేట్ ఎక్కడికి వెళ్లావు.. అంతాదాచిపెట్టా వా.... అప్పుడే వచ్చావు" అని వెటకారంగా అన్నాడు ఎస్ ఐ.
"తిరుపతి వెళ్లాను సార్ గుడిలో సెల్ ఆఫ్ చేశాను... అది తెలియక అందరూ పొరబాటు గా ఆఫీసు మీదకు వచ్చారు.. నాపై అసూయ ఉన్నవాల్లు పుకార్లు పుట్టించి ఇంత చేశారు. నా ఇంట్లోకి జొరబడి వస్తువులు కూడా పట్టుకెల్లారు. "
"అంటే అంతా వుట్టి పుకార్ అంటావు"
"అంతే సార్"
"అదే నిజం అయితే, కనీసం మీ బ్రదర్స్ కు కూడా చెప్పలేదు"
"అదీ... అదీ" బ్రదర్స్ తో మాటలు లేవని చెప్పలేక,
(కొన్న డబ్బులు వచ్చాక కొందరు దూరం అవుతారు. అందులో అన్నదమ్ములు ప్రథమలు. పెద్ద కారణాలు వుండవు కాని, మాట్లాడు కోలెనంత దూరం అవుతారు.) అనుకోకుండా వెళ్లా సార్, ఎవరికి చెప్పడం కుదుర లేదు " అన్నాడు..
అయిన వాళ్లే నమ్మరు, ఇక పోలీస్ లు నమ్ముతారా...!?
ఈ లోపు లాయర్ కూడా వచ్చాడు..
"నమస్కారం సార్.." లాయర్ ఎస్ ఐ కి నమస్కారం చేశాడు.
"ఓహో అంతా ముందే అనుకున్నారు అన్న మాట" ఎస్ ఐ అన్నాడు.
"ఇప్పుడే ఫోన్ చేశాను సార్.. లాయర్ కు కూడా తెలియదు"
"అంతేలే.... లాయర్ లకు తెలియనివి వుంటాయా.. తెలిసినా, తెలివిగా వాదించరా"
"సేట్ గారు మీరు ఆగిండి.. ఎస్ ఐ గారికి నేను చె బుతాను" అని బాలాజీ ని పక్కకు నిలకడమని చెప్పాడు.
బాలాజీ సేట్, తన భార్యను పిల్లలను సిస్టర్ ఇంటికి వెళ్లమని పంపించాడు.
"సార్ నేను స్టేషన్ లోనే వుంటాను.. మేనేజర్ ని పంపించoడి. బాగా దెబ్బలు అయ్యాయి." బాలాజీ ఎస్ ఐ ని అడిగాడు.
"కాని మా వాళ్లు కేసు బుక్ చేసారు కదా" అని ఎస్ ఐ గారు అన్నారు..
"మీరే మార్గం చెప్పండి సార్" అన్నాడు లాయర్..
"సరే, మేనేజర్ కు స్టేషన్ బెయిలు ఇస్తాను.. రెండు లక్షలవుద్ధి. కేసు సేట్ మీద బుక్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా పది లక్షలు.. ok అంటే అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి వెళ్లవచ్చు.." అన్నాడు ఎస్ ఐ సింపుల్ గా..
"అయ్యో, నేనేమీ కావాలని చేయలేదు సార్" బాలాజీ మద్య లోకి వచ్చాడు..
"మీరు రావద్దు అని చెప్పిన కదా" అంటూ బాలాజీ ని లాయర్ బయటికి తీసుకు వచ్చాడు..
"ఇప్పుడు ఎస్ ఐ కి మంచి అవకాశం దొరికింది... కేసుకు మనం ఒప్పుకొన్నా.. కోర్టుకు వెళ్లే లోపు నరకం చూపిస్తాడు.. పైగా మరికొన్ని కేసులు రాసి complicate చేస్తాడు.. ముందు ఇందులో నుండి బయట పడిoడి. లేట్ అయితే కేసు ను పై ఆఫీసర్ కు రిపోర్ట్ చేస్తారు. అప్పుడు పoచుకునే వాళ్లు ఎక్కువ అవుతారు."
"లాయర్ గారూ, నేను ఏo తప్పు చేయ లేదు. ఎందుకు వీళ్ల కు భయపడుతూ డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే నేను తప్పు ఒప్పుకొన్నట్లు అవుతుంది కదా"
"సేట్, ఇప్పుడు మీరు తప్పు చేయలేదు కాని చిక్కి పోయారు. రాంగ్ రూట్ లో వస్తే అన్ని కలిపి ఫైన్ వేసినట్లు ఇప్పుడు దొరికిన సెక్షన్ లు అన్ని కలిపి పెడతారు.. ఇప్పుడు మీరు మంచి తనం తో మేనేజర్ ను పంపించి మీరు స్టేషన్ లో వుంటాను అంటున్నారు.. కాని నాలుగు గంటలకు కానిస్టేబుల్ ను కొట్టి పారిపొవడానికి ప్రయత్నం చేశారని అటెంప్ట్ కేసు పెడతారు.."
లాయర్లు లాజిక్ తో క్లయింట్లను గారడి చేసి ( ఫీజు లు ఫ్యూజ్ లు ) లాగు తారు..
బాలాజీ కి Confusion ఎక్కువ అయ్యింది. మామూలుగా అయితే చాల తెలివిగా ఆలోచించే వాడు. కాని ఇప్పటి పరిస్థితుల్లో లాయర్ చెప్పినట్లు వినాలి అనుకున్నాడు.
"సరే మీరు చెప్పినట్లే.. కాని మరీ ఎక్కువ అడుగు తున్నాడు.. అంతా ఐదు లోపున అయ్యేటట్టు చూడండి.." అన్నాడు.
"మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. నేను చూ సుకుంటా ను" అని లోపలికి వెళ్లి ఎస్ ఐ తో క్లియర్ గా మాట్లాడి మేనేజర్ తో సహ బయటికి వచ్చాడు.
సేట్ దగ్గరికి వచ్చిన మేనేజర్ ను దుఃఖం ఆపు కోలేక పోయాడు.
"ఎమ్ కాదు శ్రీను... నేను చూసుకుంట. రేపటికి అంతా సర్దు కొంటుంది" అన్నాడు.
రేపటి కి రేపటి సీన్ వుంటుంది అని బాలాజీ గారికి తెలియదు.
"ఇంటిలో దిగ పెడతా.. కారు ఎక్కు శ్రీను" అన్నాడు సెట్.
అప్పుడే దగ్గరికి వచ్చిన కానిస్టేబుల్ "సార్ కార్ ఇక్కడే వుంచి వెళ్ల మన్నడు" అని కటువు గా అన్నాడు.
"చూశారా, ఎస్ఐ నన్ను కూడా నమ్మడము లేదు.. వీళ్లు ఇంతే.. మార్నింగ్ డబ్బులు ఇచ్చి కార్ తీసుకుని వెళ్తా.
"నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, పదoడి" అన్నాడు లాయర్.
అందరు కార్ వైపు వెళుతుండగా... బాలాజీ భార్య పిల్లలు ఎదురుగా వచ్చారు.
"ఏంటి, మళ్లీ వచ్చారు.. మా సిస్టర్ ఇంటికి వెళ్ల లేదా" అని బాలాజీ అడిగాడు..
"వెళ్లాము.. లోపలికి వెళితే అందరు అదోలా చూశారు:
"చూస్తే ఏంటి.. వాళ్లకు అనుమానం వుండ వచ్చును.. నేను వచ్చి చెబుతా కదా ఎందుకు తొందర పడి వచ్చారు" అని కోపంగా అన్నారు.
"మొదట నేను అలాగే అనుకున్న. కాని మన ఇంట్లోని పెద్ద TV అక్కడ చూసి అడిగాను. అందరు అంటుoటే.. మేము కూడా అలాగే ఆనుకుని TV తెచ్చుకున్న o.. మేమేమీ దొంగ తనం చేయలేదు" అని మాట్లాడింది మీ సిస్టర్. అందుకే వుండలేక వచ్చాను " అంది.
బంధువులకు రా బంధువులకు తేడా ఎక్కువ లేదు.
తల పట్టుకున్నా డు బాలాజీ. ఎవరు ఎవరిని పలకరిoచాలని లేదు.
"మా ఇంటికి వెళ దాo.... రేపు అన్ని మాట్లాడు కుందాo.. చిన్న అనుమానం పెద్ద పెద్ద ముప్పులు తెస్తుంది" అన్నాడు లాయర్.
"ఎమ్ తప్పు చేశాం సార్. దేవుడు దగ్గర వున్న మనీ.. ప్రశాంతంగా వుందామని సెల్ ఆఫ్ చేశాను.. అంతే కదా" బాధగా అన్నాడు బాలాజీ.
"అది అందరికీ రాంగ్ సిగ్నల్ గా వెళ్లింది.. అందరూ తమ విద్యను ప్రదర్శించారు.. జనం లో వున్న అక్కసు అంతా బయటికి వచ్చింది" అన్నాడు లాయర్.
"కాని సిస్టర్ కూడా"
"ఎమ్ చేద్దాం.. నీ టైమ్ బాగా లేదు" లాయర్ కొంత వోదార్పు గా మరికొంత వేదాంతమును చెప్పి తనతో ఇంటికి తీసుకు వెళ్లాడు.
ఇప్పుడు ముందు డబ్బులు తరువాత బందాలు అనుకుంటున్నారు అందరు..
లాయర్ ఫీజు కోసం కేసు తీసుకున్న.. పరిస్థితిని అర్థం చేసుకుని బాలాజీ కి అండగా వున్నాడు. ఒక్కోసారి మనకు ఏ సంబందము లేని వారే సమయానికి సహకారం అందిస్తారు..
* * *
మరుసటి రోజు, ఎస్ ఐ కి డబ్బులు ఇచ్చి కార్ తెచ్చుకున్నాడు బాలాజీ.. డైరెక్ట్ గా ఆఫీసు కు వెళ్లి అక్కడ వున్న వాళ్లను కూచో బెట్టి...
."నేను తిరుపతి లో దేవుని దగ్గర వుండడం వల్ల, సెల్ ఆఫ్ చేశాను.. తరువాత ఆన్ చేయడం మర్చిపోయా.... తప్పితే నాకూ ఎటువంటి చెడు వుద్దేశం లేదు. మిమ్మల్ని మోసం చేయను " అని చెప్పాడు.
"మరి మీ ఆవిడ సెల్ కూడా రోజు అంతా ఆఫ్ ఎందుకు వుంది" ఒక ప్రశ్న
"baattery down.."
"మిస్ కాల్ చూసి, మాకు ఫోన్ ఎందుకు చేయలేదు"
ఒక లాజిక్
"తిరుపతి లో కూడ బిజినెస్ గొడవ ఎందుకు.. తెల్లవారి వస్తాను కదా వచ్చాక..."
"మీ అన్నయ్య ను అడిగితే... ఒక సమాదానం.. సిస్టర్ ను అడిగితే మరో సమాదానం... మరి ముందు రోజు బ్యాంక్ లో డబ్బులు ఎందుకు డ్రా చేశారు... ఎవరికి ఇచ్చారు..." వరుస బాణాలు.
"ఏంటిది.. మర్యాద గా చెబుతుంటే రెచ్చి పోతున్నారు. మీరు చిట్టి పాడినప్పుడు మీకు డబ్బులు ఇస్తాను కదా... ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు." బాలాజీ కొంత చిరాకు పడ్డాడు.
"మళ్లీ రేపు బిచానా ఎత్తి వేయవని గ్యారంటీ ఏంటిది."
"అలా అడిగితే చెప్పడురా." ఒకడు హద్దు డాటాడు.
మేనేజర్ అడ్డు వస్తే అతన్ని నెట్టేశారు..
"ఆగoడి.. ఆఫీసు నుండి అడుగు బయట పెట్టకుండా వారం లో, మీరు ఇంతవరకు జమ చేసిన డబ్బులు బ్యాంక్ ఇంటరెస్ట్ తో సహ తిరిగి ఇస్తా ను. సరేనా" అన్నాడు సెట్.
"గ్యారంటీ ఏంటి" ఒక అపనమ్మక బాణం.
"మీరు ప్రతి రోజు తాళం వేసుకుని వెళ్ళoడి.. నేను ఇంటికి వెళ్లకుండా ఆఫీసు లో పడుకుని మీ అందరివి క్లియర్ చేస్తాను"అని అన్నాడు సెట్.
అన్నట్లు గానే వారం లో మేనేజర్ సహాయం తో ఇళ్లు అమ్మి అందరికీ డబ్బులు ఇచ్చినాడు. ఆఫీసు మూసి వేశాడు. వేయబడిoది.
మేనేజర్, నలుగురు గుమస్తా లు రోడ్డున పడ్డారు.
బాలాజీ అందరికీ డబ్బులు ఇచ్చిన, గుసగుసలు ఆగ లేదు.
మనుషులు ఇప్పుడు ఇతరుల గురించి చెడు గా మాట్లాడు కుంటూ ఆనందపడే జబ్బు అంటించు కున్నారు. దీనికి వ్యాక్సిన్ లేదు.
* * *
"ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ వుండేది లేదు" బాలాజీ భార్య తీర్మానం చేసింది.
"ఎక్కడికి పోదాం"
"వరంగల్ కాని హైదరాబాద్ కాని వెళ్లి ఏదైనా బిజినెస్ చేయండి. ఇక్కడ అయితే వద్దు.. మనల్ని మోసం చేశారు.. చివరికి మీ అక్క కూడా.."
"వూరు విడిచి వెళితే, వాళ్లు అనుకొన్నది నిజం చేసిన వాళ్ల0 అవుతా ము.. ఏదో దొరికి పోయి నీతులు మాట్లాడి నట్లు వుంటుంది."
"మరి.. ఇంత జరిగినా ఇక్కడ ఈ మొహం పెట్టుకుని వుందామని.."
"నిజాయితీ ముఖం... వాళ్లు అనుకొన్నది తప్పు అని నిరూపించాలి.. లేకుంటే జీవితాంతం మోసగాడు అని ముద్ర వేస్తారు"
"మిమ్మల్ని నమ్మని వాళ్లు ఏమీ అనుకుంటే మనకు ఏంటి"
"వాళ్లు జనం... అనుమానం వచ్చింది కాబట్టి అలా చేశారు.. దానికి నేను పరోక్షంగా కారణం కూడ. నేను కరెక్ట్ అని తేలితే... మళ్లీ వాళ్లే జేజేలు కొడతారు"
"మొండి పట్టు పట్టకుండా నా మాట వినండి... మనల్ని వాళ్లు అనుమానముగా, వాళ్ళని మనం చూసి అవమానంగా ఫీల్ అవుతూ ఇక్కడ వుండలేo. అర్థం చేసుకోండి."
"అవును మొండి పట్టు తోనే సాధ్యం. ఇక్కడే వుండి వీరి మద్య నే మళ్ళీ విజయము సాధించి, వారి అభిప్రాయం తప్పు అని నిరూపిస్థాను... వారికి నిరూపించ వలసిన అవసరం లేదు అనుకున్నా.... నా నిజాయితీ కోసం నేను ఇక్కడే వుంటాను.. ఇందుకు నీ సహనం సహాయము చాలా అవసరం..
"మరి ఎమ్ చేద్దామని అని అనుకుంటున్నారు"
"వ్యవసాయం"
"వ్య వ సా య మా!?...."
* * *
"కూరగాయలు పండిoచాలని ఎందుకు అనుకున్నారు"అడిగాడు కలెక్టరు.
"ఇక్కడ కోతుల బెడద తో చాలా మంది రైతులు కూరగాయలు లాంటి పంటలు వేయడం లేదు సార్.. నేను poly house లో పండించాలి అని అనుకున్నా.... తక్కువ నీరు, తక్కువ శ్రమ మరియు కూరగాయలకు ఎప్పుడూ డిమాండ్ వుంది.. ప్రభుత్వo కూడ సబ్సిడీ అందించింది... అలా అలా పూల మొక్కలు, ఈ మద్య డ్రాగన్ ఫ్రూట్ తోట వేసినాను... నా దగ్గర సుమారు 20 మంది ఎప్పుడు పని చేస్తూనే వుంటారు సార్.. అలా కొంతమంది కి ఉపాధి కూడా ఇవ్వగలిగినానని సంతోషం గా వుంది. మీరు ఈ అవార్డ్ ఇచ్చి ఇంకా నన్ను ప్రోత్సహించారు"
"మీరు ఈ అవార్డ్ కు చాలా అర్హులు.. ఇంకా పెద్ద పెద్ద అవార్డ్లు వస్తాయి... నా తరపున ఏమి అయినా సహాయం కావాలా.." కలెక్టర్ అడిగాడు..
"భూమి, పెట్టుబడి లేకుండా చాలా మంది యువకులు ఖాళీ గా వున్నారు సార్.. ఏదైనా పథకం తో వారికి పెట్టుబడి అందిస్తే..."
"తప్పకుండా సేఠ్... ఒక నలుగురు ఒక యూనిట్ గా ఒక పది యూనిట్ లు మొదలు పెడదాo.. ఏ పంటలు వేయాలో ఎలా చేయాలో మీరు దగ్గర వుండి నేర్పించాలి".
"తప్పకుండా సార్.."
"లోపలికి రండి కాఫీ తాగి వెలుదురు".
కలెక్టరు గారు బాలాజీ కి కాఫీ ఆఫర్ చేసి, ఆఫీసు లో ఆఫీసర్ లకు గొప్పగా పరిచయం చేసి పంపించారు.
బాలాజీ కళ్లు తుడుచుకుంటూ బయటికి వచ్చాడు..
కొన్ని నిందలు అగ్నితో, కొన్ని నిందలు విజయాలతో తుడుచుకు పోతాయి.
* * *
అవార్డ్ భార్య చేతిలో పెట్టి "thanks" చెప్పాడు బాలాజీ గారు.
"అయ్యో నాకూ థాంక్స్ చెప్పడం ఎందుకు అంది.. ఇదంతా మీ తెలివి.. మీ కృషి" అంది.
నువ్వు నాకు తోడు లేకుంటే, నేను ఇంతటి విజయము సాధించ లేక పోయే వాడిని.. అసలు ఎలా వుండే వాడిని నో.."
"ఇప్పుడు అవన్నీ వద్దు.. ఈ విజయాన్ని మన టీం తో పంచు కుండా o.. అందరినీ పిలవoడి.. భోజనాలు ఏర్పాటు చేస్తాను.."
"అలాగే ఈ విజయము అందరికీ అంకితం"
అడవిలో అయినా... లక్ష్య సాధనలో అయినా భార్య తోడు వుంటే ఏ భర్త అయినా ఎన్ని సవాళ్లను ఎదుర్కొని నిలబడతాడు, జనంను మెప్పిస్థాడు.
అనుమానం చోట విజయం పొంది మళ్ళీ అందరి మన్ననలు పొందాడు బాలాజీ సేఠ్.
* * *