ఏది ప్రళయం  (Author: సుధాకర్ రెడ్డి)

లోకానికి వినాశనమా ప్రళయం 

ధరణి యొక్క అంతమా ప్రళయం

ప్రజా వినాశనమా ప్రళయం

లోకానికి వరకట్నం ప్రళయం

ఏది ప్రళయం?

ఒకరినొకరు మోసం చేసుకోవడం ప్రళయం

దురాచారాల పెనుభూతం ప్రళయం

నమ్మకాన్ని వినాశనం చేయుట ప్రళయం 

కులమతాల బేధం ప్రళయం

బాల్యవివాహాల దురాచారం ప్రళయం

పేదల పట్ల అసమానత ప్రళయం

అంటరానితనం ప్రళయం 

ఈ ప్రళయాన్ని తప్పించుటకు ధనిక, పేదల సమానత ముఖ్యం

దురాచారాల నిర్మూలన అనివార్యం

మనుషుల మధ్య నమ్మకం అత్యవసరం

ఈ మార్గాన్ని సుగమం చేయడం కోసం

మన సమస్త భారతీయులం కలిసి తీసుకుందాం ఒక నిర్ణయం 

అదే మన దేశానికి ప్రళయం నుండి రక్షా వలయం.

0 hozzászólás