అధ్యక్షుని సందేశం  (Author: అన్నా మధు (TFAS అధ్యక్షులు))

తెలుగు కళా సమితి సభ్యులందరికీ నమస్సుమాంజలి. మరొక్కసారి మన తెలుగు జ్యోతి ద్వారా నా అనుభవాలు, TFAS వివరాలు అందజేయడం ఎంతో సంతోషం. 

ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి, కొద్దిపాటి విరామం తర్వాత జూన్ 12న బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ద్వారా విరచితమైన “శివ పదం” లోని కొన్ని అంశాలకు నృత్య మాధవి డాన్స్ అకాడమీ, శ్రీమతి ఏలూరు దివ్య గారి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన వారి శిష్యులు మరియు నాట్య కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను కట్టిపడేశాయి.   శ్రీ షణ్ముఖ శర్మ గారి వ్యాఖ్యానాలు, సందేశాలు ప్రేక్షకులను భక్తి భావంతో ముంచెత్తాయి.  సంగీతం, నృత్యం, సాహిత్యం, భక్తి మేళవించిన ఈ కార్యక్రమం అందరి చేత ప్రశంసలందుకొంది.  ముఖ్యంగా శ్రీ శేఖర్ వెంపరాల గారు, వారి సతీమణి శ్రీ మాధవి గార్ల సహాయం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.

TFAS Advisor శ్రీ టి పి శ్రీనివాసరావు గారి సహాయంతో TFAS చరిత్రలో మొట్టమొదటి వినూత్నం గా బౌలింగ్ టోర్నమెంట్ నిర్వహించాము.  ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చక్కటి ఆకర్షణ, ఆనందం. 

జూలై 20Hawaii Theme లో నిర్వహించిన Picnic సభ్యులతో కిక్కిరిసి, అత్యంత శోభాయమానంగా జరిగింది.  హాజరైన ప్రతి ఒక్కరూ మా కార్యవర్గ సభ్యులను అభినందించి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు.  ఎన్నో తెలుగు సంస్థల ప్రతినిధులు వచ్చి అభినందనలు తెలియజేయడం TFAS కు న్యూ జెర్సీలో ఉన్న విలువను, గౌరవాన్ని సూచించింది.   రాబోయే కార్యక్రమాలన్నిటికీ సభ్యులందరూ వారి సహాయ సహకారాలతో జయప్రదం చేయవలసిందిగా మా కార్యవర్గ సభ్యుల కోరిక

మీ

మధు అన్న.

0 hozzászólás