ఎవరు వారు (కవితలలో 2 వ బహుమతి గ్రహీత)  (Author: సింహగిరి)

        అటు పూర్వార్ధం నుండీ ఇటు పశ్చిమార్ధం వరకూ-

         విశ్వనగరాల్లో శ్రవణానందంగా ఆకర్ణించే నా మాట!

         నా స్వరధారల అల్లికల జిగిబిగిల తన్మయత్వం,

         నాపద్యపాదల యతి ప్రాసల వయ్యారం,

         సర్వ శబ్దాల్నీ పలికించే వర్ణమాల వైశిష్ట్యం,

         లెస్సని మెచ్చేడు గదా అష్టదిగ్గజాల పోషకుడు!

         నన్నయ నావాక్కును శాసించీ నిబధ్ధతకల్పిస్తే,

         నాలాలిత్యాన్ని సున్నితంగా పలికించేడు పోతన్న!

         మూలమూలల్లో నా మూలాలు వెదకిన బ్రౌనన్న

         పులకించి తపించి తరించిన దొడ్డ దొరన్నకదా మరి!

         నవ కవులు వర్ణించి జనకథకులు వివరించి

         ఘన కీర్తి సృష్టించిన కృతి చరితలెన్నెన్ని?

         శతాధిక సంఘలూ, సంస్థలూ విశ్వ వ్యాప్తంగా

         నీరాజనాలు పలికే నా బోధనాలయాల్లో చిరుతల

         మాతృహృదయాలను అనుకంపించే పసిగొంతులెన్నెన్ని?

         శతాబ్దాల తరబడి కోట్లాది జిహ్వలపై రసజ్ఞంగా నర్తిస్తోన్న నన్ను

            కనుమరుగై పోతోందని వాపోయిందెవ్వరు? అసలెవరువారు? (సమాప్తం)

Ajouter des commentaires