ఆత్మ సమీక్ష  (Author: కోరాడ అప్పలరాజు)

కలలకు కనకపు పూత పూసి

గాలి తెరల గగనంలో

విహంగమై విహరిస్తాడు.

అడ్డొచ్చిన మేఘమాలికలను

అవలీలగా తొలగిస్తాడు.

 

నోట్ల భాష తెలియడం వలన కాబోలు..

పాట్లుకి దూరంగా  ఉంటూ

ప్యాలస్లో  నివసిస్తాడు.

 

పిల్ల తెమ్మెరలు పలకరిస్తుంటే

ఒళ్ళుని చల్లబరుచుకుని

పూల సెజ్జపై పవళిస్తాడు.

 

కను సైగ..

కార్యాలు చక్కబెడుతుంటే..

కరస్పర్శతో పూలతీగల్ని సవరిస్తాడు.

గుప్పెడు గింజలు పండించనప్పటికీ

షడ్రుచులతో విందారగిస్తాడు.

 

సేవనే పదానికి

అర్థం తెలియకపోయినా

గువ్వల సేవలు

నిత్య నైవేద్యంలా అందుకుంటాడు.

 

చీమలు పెట్టిన పుట్టల్లో

పాములు చొరబడినట్లు..

తేనెటీగల మధువుని

బాటసారి దోచుకున్నట్లు..

చోర కళలో ప్రావీణ్యం సంపాదించి

భోషాణాన్ని భాగ్యపు

రాశులతో నింపుకుంటాడు.

 

కాయం కందకుండా..

కార్లలో షికారు చేసి..

ఐశ్వర్యానికి ఆనవాళ్లుగా నిలుస్తాడు.

 

విలువలుకు వలువలు తీసి

పరహితాన్ని పరిహసించి

కాయాన్ని  ఇప్పుడు..

రుగ్మతల కార్ఖనా చేసుకున్నాడు.

జల్సాల జడివానలో  తడిసి

 

ఏడడుగుల బంధానికి నీళ్ళొదిలి

పచ్చ నోట్లు...

ప్రేమాప్యాయతలు పంచవని

ఆయువు అనంతవాయువులో కలిసి పోయాక

ఆలస్యంగా ఆత్మ సమీక్ష చేసుకున్నాడు.

*****

View Attachment 1
Lisää kommentteja

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)