TFAS అధ్యక్షుని సందేశం
అధ్యక్షుని సందేశం (Author: అన్నా మధు)
భోగి మంటలు వేసినా నిన్ను వదలనని ఉధృతంగా కురిసిన భయంకరమైన మంచు తుపాన్లు ఫిబ్రవరి లో మన జీవితాల్ని నిర్బంధించాయి.
చలిలో జరిగిన సంక్రాంతి సంబరాల అద్భుతమైన స్పందనతో మా కార్యవర్గం వెంటనే తెలుగు కళాసమితి విలువను, వన్నెనూ, ప్రాశస్త్యాన్ని చేకూర్చే త్రిమూర్తి ఆరాధనకు పూర్తిగా సన్నద్ధమై ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆ కార్యక్రమ వివరాలు ఇంకొక అంశంలో పొందుపరిచాను – చదివి ఆస్వాదించగలరు.
మార్చి 14నాడు సభ్యుల ఆరోగ్య సంక్షేమం కోరుతూ “జీవన శైలి వ్యాధుల నివారణ లో Naturopathy“ అనే అంశంపై మేము నిర్వహించిన అంతర్జాల సమావేశానికి సుమారు 60 మంది పాల్గొని విజయవంతం చేసారు. విజయవాడ లోని అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన మంతెన సత్యనారాయణ రాజు నేచర్ క్యూర్ హాస్పిటల్ సూపరిండెంట్ డా.బైరి శ్రీనివాసరావు గారు తెలియజేసిన విషయాలు, ప్రశ్నలకి వారి జవాబులు ఎంతో ఉపయోగపడ్డాయని సభ్యులు తెలిపారు.
తెలుగు కళా సమితి కార్యక్రమాలు 2024-26 లో ఇంత విజయవంతం గా సంతోషం గా, ఉత్సాహంగా పరుగులు తీస్తున్నాయంటే అది మా కార్యవర్గ దీక్ష, పట్టుదల, అంకిత స్వభావాలే దానికి పునాది. వారందరికీ నాకృతజ్ఞతలు!
చిట్టచివరిగా ఒక ముఖ్య విషయం. 2026-28 సం।। లకు పోటీ లేకుండా ఎన్నికైన నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు. మే 3వ తేదీన రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో జరగబోతున్న ఉగాది సంబరాలలో వీరిని పరిచయం చెయ్యడం జరుగుంది. మీరందరూ తప్పకుండా విచ్చేసి వీరిని కలుసుకోగలరు.
ఏమిచేసినా, ఎన్నిచెప్పినా సభ్యుల సహకారమే ఈ విజయాలకు ముఖ్య కారణం. మీలో ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ
అన్నా మధు

