సంపాదకుని మాట!
సంపాదకుని మాట! (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్)
దేశ ప్రగతికి GDP వంటివి ఆర్ధిక సూచికలైతే, ఎన్నికలు ఒక పెద్ద రాజకీయ సూచిక. ఎన్నికలు ఎలా నడిచాయి, ప్రజలు ఓట్లు ఎలా వేశారు ఎవరికి వేశారు అన్నవి దేశ పరిపక్వతకీ ప్రజల మానసిక పరిణతికి పెద్ద తార్కాణాలు. ఎంతో మంది ఆర్ధిక పండితులు GDP లెక్కలు వేసి భారత దేశం ఫలానా పరిస్థితిలో ఉన్నది అని చెప్పగలిగారు. కానీ ప్రజలు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారా లేదా అన్నది ఎన్నికలతోనే తెలియాలి. ఆ లెక్కల్లో భారత ప్రజానీకం A+ grade సాధించిందని ఘంటాపథంగా చెప్పచ్చు. ఉద్వేగంగా చేసిన ఉపన్యాసాలకి కానీ, ఉదారంగా పంచి పెట్టిన సారా పొట్లాలకి గానీ, లెక్కకి మిక్కిలిగా చేసిన ప్రమాణాలకి గానీ మోసపోకుండా నేరుగా సూటిగా తమ అభిప్రాయం చెప్పగలిగారు, కేంద్రంలో గానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కానీ. రాష్ట్ర ప్రగతి కోసం అవిరామంగా కృషి చేసిన తెలుగు దేశం పార్టీకి మహోన్నతమైన పెద్ద పీట వేసి ఐదు సంవత్సరాల చీకటి రాత్రులు తరిమి కొట్టారు మన వాళ్ళు. భారతీయుడినని, తెలుగు వాణ్ణని చెప్పుకోడానికి ఈ రోజు గర్వంగా ఉన్నది.
ఇక ఈ ఉగాది సంచికకొస్తే, మా software సమస్యలు మమ్మల్ని ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. మొత్తం మీద కొంత ఆలస్యంగా ఈ సంచిక మీముందుంచుతున్నాం.
మా ఈ క్రొత్త ప్రయోగం పై మీ అభిప్రాయాల్ని తెలియజేయ ప్రార్థన. అలాగే ప్రతి అంశంపైనా మీరు అభిప్రాయాల్ని మాకు అందచేయవచ్చు.
ఈ సంచిక లో ప్రముఖంగాః
కథలు
నాగ జ్యోతి గారి ‘కాంతి’ - స్త్రీ స్వాతంత్ర్యం మీద
శాంతి కృష్ణ గారి ‘మారిన శీతా కాలం’ – మంచితనం మనుషులని మారుస్తుంది అని
సుజనా దేవి గారి ‘శిశిరంలో వసంతం’ – రిటైర్ మెంట్ సమస్యలు
సత్తయ్య గారి ‘రాతి గుండెలు’ – కుటుంబం లో కుట్రలు
అజయ్ కుమార్ గారి ‘పశ్చాత్తాపం’ – కారు ఏక్సిడెంట్ తో మనసు మార్పు
కవితలు
సనాతని గారి ‘మేమింకా అక్కడే’ – బీదల పరిస్థితి మారలేదు
వేంకట రమణ గారి ‘వృధ్ధాప్యం ఎంత దయలేని దండనో’ – ముసలితనపు ఒంటరి తనం మీద
పూర్ణ ప్రజ్ఞాచారి గారి ‘తెలుగు సౌరభం’, లక్ష్మీ ప్రసన్న గారి ‘సాన పెట్టని వజ్రం – తెలుగు తల్లికి మల్లెపూదండలు
ప్రకాష్ రావు గారి ‘గర్భస్థ శిశువు’ – పిండం యొక్క వేదన
ఇంకా ఎన్నో కవితలున్నాయి ఈ సంచికలో!