రైతు (బాలల అంశం)  (Author: బి. అలకనంద (ఎనిమిదవ తరగతి))

అనగనగా అవంతిపురం అనే గ్రామం ఉంది. ఊరిలో గొప్ప వెంకటేశ్వర స్వామి ఆలయంతోపాటు, సరస్వతీదేవి గుడి కూడా ఉంది. ఊరిలో ఉన్న చుట్టాల ఇంటికి అమెరికా నుండి రాబర్ట్ అనే వ్యాపారవేత్త వచ్చాడు. అతడు ఒకరోజు గుళ్ళను దర్శించుకుంటూ, పొలాలను చూస్తూ నడుస్తున్నాడు. ఒక రైతు పొలంలో చెమటలు కక్కుతూ వ్యవసాయం చేయడం గమనించాడు. అప్పుడు అతడి దగ్గరికి వెళ్లి వ్యవసాయం ఇంత కష్టపడి చేస్తారా? మీకు చెమటలు విపరీతంగా వస్తున్నాయి. అసలు ఏమేం పనులు చేస్తారు మీరు వ్యవసాయంలో? అని అడిగాడు. నేను, నా భార్య పొద్దున్నే నాలుగు గంటలకే లేచి ఇల్లంతా ఊడ్చి, అలికి ముగ్గులు పెట్టుకుని, వంట చేసుకుని, సద్ది కట్టుకొని పొలానికి బయలుదేరుతాము. ఎండ భగభగ మండుతున్న పొలాన్ని దుక్కి దున్ని, విత్తనాలు పెట్టి, గుంటుక కొట్టి, గడ్డి తియ్యాలి. తర్వాత సేంద్రియ ఎరువులు మాత్రమే వేస్తాము. మళ్ళు మళ్ళుగా మంచి విత్తనాలతో నారు వేస్తామువర్షాలు పడితే నీళ్లు పెట్టకపోయినా పరవాలేదు. కానీ వర్షాలు పడకపోతే చెరువుల ద్వారా నీటి వసతి కల్పించాలి. నారు కాస్త పెరిగిన తర్వాత నాట్లు వేస్తాము. ఒక్కోసారి నీళ్లను బోర్ల ద్వారా కూడా పెడతాముచుట్టుపక్కల ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉండడం వల్ల మాకు కాలుష్యం సమస్య ఎక్కువనే చెప్పాలి. నేలంతా సారం తగ్గిపోతుంది. చీడ పీడల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దిగుబడి ఎక్కువగా రావడం లేదు. అందుకు తోడు ఒక్కోసారి తుఫాన్లు, విపరీతమైన వర్షాలు కూడా వస్తుంటాయి. అంత బాగా పండినప్పుడు ఒక్కోసారి గిట్టుబాటు ధర ఉండదు. ఇలా ఒక్కటేమిటి అనేకమైన తిప్పలు పడుతుంటాం సారు. అయ్యో ఇన్ని ఇబ్బందులు ఉంటాయా? అన్నాడు రాబర్ట్. అయ్యో ఇంతటితో అయిపోయిందా సారు, ఓపికగా, ఇంత కష్టం చేసి పంట పండించినా మాకు అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుంది. పరిస్థితులు ఏమన్నా తిప్పి కొడితే అంతకంతకు లాసే. కొంతమంది మా రైతులు అప్పుల బాధకు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అవునా! మీ సమస్యలు తీరాలని కోరుకుంటున్నాను. నా వంతు సహకారం అందించడానికి ఆలోచిస్తాను. అంటూ రాకపోతే అక్కడ నుంచి కదిలాడు.

添加评论