మొలిచి చూడు  (Author: డా. దారల విజయ కుమారి)

ఏ పొగడ్తల పూలో..నీ పైన గుప్పిస్తున్నపుడు.. ఏ స్తుతుల గజ మాలలో నిన్ను మోసేస్తున్నపుడు నీకు బాగుంటుంది నిన్ను రాసేందుకు..చదివేందుకు అందరికీ అందవు..చిక్కవు నిన్ను వెతక్కోవాలన్నా.. నువ్వు వెసులుబాటు కల్పించవు నీకు అంతగా పరిచయం లేని..మానవతను తెచ్చి చూపేందుకు సల్లొదలవు ఉచ్చులో నువ్వు ఉల్లి గడ్డలా గా ఎరగా అయిపోయావని కోట్ల కౌగిలింతలు ఊపిరాడనీయవని నీకు తెలియక పోవడం ఎంత విషాదం నిన్ను విసిరేసేందుకే వివిధ కారణాలున్నపుడు దగ్గరకి తీసుకునేందుకు వీలుగా నీ దగ్గర ఏమీ మిగలదు నిన్ను చింపేసినట్టు.. ఏ వర్గాల చెత్తబుట్టలో నో పారేసినట్టు నీకెప్పటికో తెలుస్తుంది ఎవరికీ పంచివ్వకుండా ఏ చేయినీ పట్టి లేపకుండా ఎవరినీ పొందుకోనీకుండా ఎలా బతికేసావో స్వార్థపు జలతారుల్లో చిక్కుకున్నప్పుడు సుఖంగానే ఉంటుంది బిగుసు కుంటున్నప్పుడే..తెలిసొస్తుంది చీకట్ల మధ్యన కూర్చున్న నీకోసం వెలుగును వెంటబెట్టుకుని ఒక్క సూర్యుడైనా ఎంతకూ రాలేదని.. ఒకే ఒక్క సాయపు కిరణం కోసం నువ్వు ఎడతెగని రాత్రిని వేడుకుంటున్నప్పుడు ఎవరో ఎత్తుల్లో నుంచీ తోసేసిన అనుభూతి ఒక్క సారన్నా..అనుభవంలోకి వచ్చాకే.. నిన్నటి నువ్వు గుర్తొస్తే..నువ్వు సిగ్గు పడుతున్నప్పుడు అమ్మ సద్దరొట్టె తట్టిన చప్పుడు నాన్న మడికి నీళ్ళు కట్టిన దృశ్యం.. నువ్వెప్పుడో వదిలి వచ్చిన పెచ్చులూడిన బడి నీ చిరుగుల చొక్కా..నీ చెడ్డీ దోస్తు.. మేష్టారు చెప్పిన మోరల్ కథ గుర్తొస్తాయి జీవితానికి పనికొచ్చే ఎక్కాలు సరిగ్గా నేర్చుకోలేదన్న స్పృహ నిన్ను నిస్పృహ లోకి నెట్టేయక ముందే... అప్పటి నిన్ను యథాతథంగా వెనక్కి తెచ్చేసుకుని పాతేసుకుంటే నీలో మనిషితనం మళ్ళీ పిలకలేస్తుంది

添加评论

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)