బంధమా బంధనమా  (Author: 'శ్రీఝా' (జాష్టి ఝాన్సీ లక్ష్మి))

విధాత రాతతో స్వర్గంలో ముడిపడిన బంధం

ఏడు అడుగులు మూడు ముళ్ళతో జతపడిన బంధం

మనసులు కలిస్తే నిశ్చయంగా మధురానుబంధమే

కానీ, తనువులు మాత్రమే ముడిపడి మనసులు ముడిపడకుంటే

బంధం కాస్తా బంధనంగా మారి చేస్తుంది జీవితాన్ని చిన్నాభిన్నం

బ్రహ్మనాడిపై పెట్టే జీలకర్ర బెల్లం మహత్యం

గ్రహ నక్షత్రాల గమనాన్ని అనుసరించి వేదపండితులు నిర్ణయించిన

సుముహూర్తంలో కలుసుకునే చూపుల ఆకర్షణ బలం

ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి అని చేసే ప్రమాణాలు

పురోహితులు, ఆహ్వానితుల, మాతాపితరుల ఆశీర్వచనాలు ఫలాలు

ఒకరి అడుగుజాడల్లో ఒకరు భావి ప్రయాణం సాగిస్తామని

కొంగుముడి సహితంగా అగ్ని సాక్షిగా చేసే సప్తపది

వీటిలో ఏ ఒక్కటి విడాకుల పర్వానికి అడ్డుపడట్లేదు ఎందుకు?

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిర్వచనమిచ్చే

వివాహ వ్యవస్థ చిన్నాభిన్నం అవడంలో ఎవరిపాత్ర ఎంత?

సూర్యచంద్రులు కేవలం గ్రహాలు మాత్రమే అనే వైజ్ఞానికత

ముహూర్త బలాన్ని తగ్గించేసిందా?

మనం బాగుంటే చాలు పక్కనోడు ఏమైతే ఏంటి అనే నిర్లిప్తత

ఆశీర్వచనాలను కూడా యాంత్రికం చేసిందా?

ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నత

సర్దుకుపోలేని తత్వాన్ని అలవరచిందా?

కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు

మూడుముళ్ల బంధం విచ్చిన్నానికి అన్నీ కారణభూతాలే

మూడుముళ్లను స్వేచ్ఛకు బంధనంలో కాకుండా

మధురబంధంలా మార్చుకునే నేర్పు కావాలి ఈ తరానికి.

添加评论

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)