తెలుగు వెలుగుల మహోదయం  (Author: ఎల్. ప్రఫుల్ల చంద్ర)

తెలుగు వెలుగుల శుభోదయం 

తెలుగు జాతికి మహోదయం 

తేనె లొలుకు తీయనైన

తెలుగు భాష కు వందనం 

వెలుగు బాషకు అభివందనం 

 

తెలుగు నాట తెలుగు నోట 

కళ కళ లాడే కళా వైభవం 

మన తెలుగు భాష 

తెలుగు తల్లికి వందనం 

తెలుగు బాష కు అభివందనం 

 

తెలుగింట తెలుగు వెలుగులు 

రాయలేలిన రస వైభవం 

తెలుగు బాష కు కీర్తి కిరీటం 

తెలుగు జాతికి పట్టాభిషేకం 

తెలుగు తల్లికి వందనం 

 

అందమైన భాష మన తెలుగు భాష 

అందమైన అక్షరాలు తెలుగు అక్షరాలు 

తెలుగు కీర్తి కి పట్టాభిషేకం 

తెలుగు తల్లి కి వందనం 

వెలుగు భాష కు అభివందనం 

添加评论