దేశమంటే యుద్ధం కాదోయ్
దేశమంటే యుద్ధం కాదోయ్ (Author: జడా సుబ్బారావు)
ఇప్పుడు దేశం శ్వాస నిండా దిగులు మేఘం కమ్ముకుంది
పీల్చే గాలి నిండా యుద్ధ భయం ముసురుకుంది
దేశమంటే మట్టికాదోయ్ నినాదం నిన్నటి కథ
దేశమంటే యుద్ధమేనోయ్ వివాదం రేపటి వ్యథ!
కళ్లనిండా ముళ్లకంచెలు గుండెనిండా రాతిగోడలు
కాళ్లనిండా ఇనుప గొలుసులు ప్రపంచమొక మానని గాయంగా
యుద్ధమొక తీరని శోకంగా రూపాంతరం చెందుతూనే ఉంది!
శాంతి వచనాల ఖననం సమానత్వ భావాల దహనం
దేశాలకు నిర్వచనంగా మారిపోయింది
దేశమంటే మట్టీ కాదు, యుద్ధమూ కాదు!
అహం గోడలపైన మనిషితనం మొలకెత్తాల్సిన స్థలం
రాతి గుండెల్లో మానవత్వ ధారలు కురవాల్సిన తరుణం!
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)