తెలుగు వెలుగు!  (Author: కోరుకొండ లక్ష్మణరావు)

తెలుగు భాష వైభవం....

తెరమరుగయ్యింది!/

తెలుగు భాష సోయగం....

కనుమరుగయ్యింది !/

 

రాయల కొలువులో

రాణించిన తెలుగు/

అష్టదిగ్గజాల గంటముల

అలరారిన తెలుగు/

తేట తేట తెలుగు...

తేనెలొలుకు తెలుగు!/

తెలుగు భాష వైభవం..

తెరమరుగయ్యింది!/

తెలుగు భాష సోయగం... కనుమరుగయ్యింది!/

 

గ్రాంథిక భాషకు గ్రహణం పట్టింది!/

పరభాషా వ్యామోహంతో

తెలుగంటే అలుసయ్యింది!/

అమ్మా నాన్ల అచ్చతెలుగు

మమ్మీ, డాడీల రాకతో మసకబారింది!/

తెలుగు భాష వైభవం...

తెరమరుగయ్యింది!/

తెలుగు భాష సోయగం...

కనుమరుగయ్యింది!/

 

మారాలి మన ధృక్పధం!/

అమ్మ భాషకు అందలం

కావాలి మనందరికీ ఆదర్శం!/

ఉగ్గుపాలలో కలపాలండీ

మాతృభాష పై మమకారం!/

 

అధికార భాషగా

అలరారాలి తెలుగు!/

విద్యాబోధన మాధ్యమంగా

విలసిల్లాలి  తెలుగు!/

 

తెలుగు సంఘానికి సాధికారత,

తెలుగు సాహిత్య వికాసానికి  

సమధిక ప్రోత్సాహం

కావాలి ప్రభుత్వ ప్రాధమ్యాలు!/

అప్పుడే సాకారమౌతుంది

తెలుగు భాషకు పునర్వైభవం!

0 Reacties