ఆ నిశానీ వెనుక  (Author: కొంపెల్ల కామేశ్వరరావు)

ఆ నిశానీ వెనుక 
అతని గుండెల్లో కమ్ముకున్న 
నిరవధికమైన అంధకారం 

జ్ఞానచక్షువు చుట్టూ ఆకలి రాక్షసి పన్నిన 
పేదరికపు జ్వాలాజాలం

ఏ శుక్రకణం ఎవరి అండంతో 
సంగమించిందో తెలియక
ఎంగిలి ఆకులు వెతుక్కుంటున్న బాల్యం
అక్షర హృదయ సౌందర్యమెరుగదు

ఎంత ఎదిగినా ముందుకు నడుస్తున్నట్టే నడుస్తూ 
వెనక్కే సాగుతున్న పయనం
వెనక్కి వెళ్తున్నప్పటి ఆ పయనాన్నే అనుసరిస్తూ 
అక్షర దేహాన్ని చూడలేని
వేల వ్యక్తుల సామూహిక నడక
అక్షరం వెలిగించిన 
దీపం కింద చీకటినే చూసే నిరక్షరాస్యత 

ఆ నిశానీ వెనుక
అమ్మ స్తన్యం తాగి జీర్ణించుకున్నంత సులువైన
అమ్మభాషను పాదధూళి కన్నా 
హీనంగా చీదరించుకుంటూ
ఆంగ్లభాషతో అధికార గర్వం 
కలిసి నేసిన కుతంత్రం

ప్రపంచమెంతగా గ్రహాంతరాల్లోకి చూస్తున్నా
ఆకాశంలో పేరుకున్న చీకటే కనిపిస్తూ ఉంటే
ఎప్పటికీ ఆ నిశానీ రేఖల్లోంచే
బతుకును గడిపేస్తున్న
జనానికి చేవ్రాళ్ళ దగా తెలిసేదెప్పుడో
 

0 Reacties

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)