వందనం! అభివందనం!!  (Author: బైటారు మాధవి)

ఉగ్గుపాలతో  దేశభక్తిని రంగరించి అమ్మ చెప్పిన దేశ భక్తుల కధలు విని 

చిన్ననాటి నుండే మాతృ భూమి పై ప్రేమ ని  అణువణువునా నింపుకుని సైన్యం లో చేరడానికి ఉర్రూతలూగి

అన్ని కఠిన పరీక్ష లలో నిలిచి చిరుతలా సైన్యం లో  చేరుతావు

భరతమాత ముద్దు బిడ్డనని  మురిసిపోతావు

క్రమశిక్షణకు, ధైర్యానికి, తెగువకు, త్యాగానికి మారుపేరు నువ్వు

ఏమని పొగడము నీ గొప్పదనాన్ని

ఓ సైనికుడా! పరాక్రమవంతుడా !

వందనం! అభివందనం!

 నిప్పులు కక్కే  ఎండైనా ,ఎముకలు కొరికే చలైనా

గడ్డ కట్టించే మంచైనా ఆపదు నిను ఏ శక్తి

పగలనక, రేయనక  సరిహద్దుల్లో  అనుక్షణం అప్రమత్తమై

ఏ నిమిషం ఎటునుంచి వచ్చే ముప్పు తో పోరాడేందుకు సదా సన్నిద్ధం గా ఉంటావు

కోట్లాది మోములలో చిరునవ్వులకోసం బాధలన్నీ భరిస్తావు

ఏమి ఇచ్చి నీ ఋణం తీర్చుకోగలము

ఓ సైనికుడా! సాహస వీరుడా! 

వందనం! అభివందనం!

  తల్లి తండ్రులను, పెరిగిన  ఊరిని,అన్నిటిని వదిలి దేశమాత సేవకై తరలిపోతావు

 భార్యాపిల్లలను కూడా వదిలి సుదూరాలలో సేవలు చేస్తుంటావు

 అల్లర్లు ,ముచ్చట్లు చూడకుండానే ఎదిగిన పిల్లలని చూసి ఆశ్చర్యపోతావు

మా కుటుంబాలను రక్షించడానికి నీ కుటుంబానికే దూరమౌతావు

దేశవాసులకోసం నీ సుఖాలను త్యాగం చేస్తున్న

ఓ సైనికుడా! త్యాగ మూర్తి!

వందనం! అభివందనం!

 సరిహద్దు లోనే కాదు దేశం లోపల  పిలవగానే పలుకుతావు

ప్రకృతి వైపరీత్యాలలో మేమున్నాం  అంటూ ఆపన్న హస్తం అందిస్తావు

ఆటుపోట్లను మాకోసం భరిస్తూ

మేమంతా క్షేమం  గా ఉండటమే నీ భాద్యత అని తలుస్తావు

కొదమ సింహం లాంటి

ఓ సైనికుడా!  నిజమైన నాయకుడా!  

వందనం! అభివందనం!

 ప్రతిరాత్రి మేము గుండెలపై చెయ్యి వేసుకుని పడుకున్నామంటే నువ్వక్కడ ఉన్నావని భరోసాయే 

శత్రుదేశానికి చిక్కినా దేశరహస్యాలను గుట్టుగా ఉంచుతావు

నీ విధ్యుక్త ధర్మాన్ని మరువవు నిమిషమైనా

 యుద్ధం లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిసి కూడా నీ పిల్లలను కూడా పంపడానికి వేయవు  వెనుకడుగు

శత్రువుల పాలిట సింహ స్వప్నమా !

వందనం! అభివందనం!

 

コメントの追加

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)