లిటిల్ సోల్జర్  (Author: చేసెట్టి శివప్రసాద్)

పెద్దగా జన సంచారం లేని రోడ్డుపై ఒక పెద్దావిడ నడుచుకుంటూ వెళుతోంది. బైక్ పై వెనక నుండి వచ్చిన ఇద్దరు యువకులు ఆ పెద్దావిడ మెడలో బంగారు గొలుసు లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఊహించని ఈ హఠాత్పరిణామం వల్ల ఆ పెద్దావిడ కింద పడిపోయింది. తలకు దెబ్బ తగిలింది. మెడలో బంగారు గొలుసు దుండగులు లాక్కోవడం వల్ల మెడ స్వల్పంగా కోసుకుపోయి రక్తస్రావం అవుతోంది.

         ఆ మహిళ షాక్ నుండి తేరుకొని తనకు తగిలిన దెబ్బలతో బాధపడుతూ తన మెడలో బంగారు గొలుసు లాక్కునిపోయారని గ్రహించి దొంగలు పారిపోయిన వైపు చూస్తుంది. అప్పటికే దొంగలు ఇద్దరూ బైక్ తో సహా కింద పడిపోయి గాయాలతో బాధపడుతూ కుయ్యో మొర్రో అంటూ ఉన్నారు. ఒక పిల్లవాడు స్కూల్ బ్యాగ్ తో వారిద్దరిని చితకబాదుతూ కనిపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన పెద్దావిడకు ఏమీ అర్థం కాలేదు. ఆ దొంగలు ఇద్దరూ దెబ్బలు భరించలేక బంగారు గొలుసు ఆ అబ్బాయికి ఇచ్చివేసి తమను కొట్ట వద్దంటూ వేడుకుంటున్నారు.

         కొంతమంది జనం ఈ దృశ్యం చూస్తూ అక్కడ గుమిగూడారు. వాళ్లలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. దొంగలను ఆ జనాలకు అప్పగించి పెద్దావిడ దగ్గరకు వచ్చాడు స్కూల్ బాయ్ అజయ్. పెద్దావిడకు తన స్కూల్ బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగించాడు. తాను దొంగల దగ్గర తీసుకున్న బంగారు గొలుసును ఆ పెద్దావిడకు ఇచ్చి వేశాడు. ఆమె ఎంతగానో సంతోషించి అజయ్ ధైర్యసాహసాలను మెచ్చుకుంది.

         అజయ్ ఆమెను హాస్పిటల్కు తీసుకు వెళ్తానని అన్నాడు. ఆమె అజయ్ తో దెబ్బలు పెద్దగా ఏమీ తగలలేదు. హాస్పిటల్ అవసరం లేదు అని చెప్పింది. అజయ్ ఆమె వద్దంటున్నా హాస్పిటల్ కు తీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకుని ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పెద్దావిడ అజయ్ ను ముద్దు పెట్టుకుని "నీ పేరేంటి నాన్నా" అని అడిగింది. "నా పేరు అజయ్ బామ్మగారు" అని బదులిచ్చాడు అజయ్.

         ఇద్దరూ హాస్పిటల్ కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ మరియు వారి బృందం అక్కడికి వచ్చారు. దొంగలు ఇద్దరినీ అరెస్ట్ చేసి అక్కడ గుమిగూడిన జనాన్ని విచారించారు. ఆ దొంగలను పట్టుకుంది అజయ్ అని తెలుసుకొని అజయ్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో దొంగలను బలే పట్టుకున్నావు... శభాష్! అంటూ అభినందించాడు ఇన్స్పెక్టర్ కిషోర్.

         అజయ్ మరియు పెద్దావిడను పోలీసులు వారి వెహికల్ లో ఎక్కించుకున్నారు. అజయ్ ను వాళ్ళ ఇంటిదగ్గర దిగబెట్టారు. ఇన్స్పెక్టర్ కిషోర్ అజయ్ తో "రేపు మీ అమ్మానాన్నలతో ఒకసారి పోలీస్ స్టేషన్ కు రావాలి. విచారణకు సహకరించి స్టేట్మెంట్ ఇవ్వాలి" అని చెప్పాడు. పెద్దావిడను హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు పోలీసులు.

          **************

          అజయ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, అజయ్ ని చూస్తూనే కంగారుగా దగ్గరకు వచ్చి "ఏమైంది నాన్నా! ఈరోజు ఇంత లేటుగా వచ్చావు. నీకోసం నేను టెన్షన్ పడుతున్నాను. ఇంకా రాలేదేమిటి? అని స్కూల్లో ఏమైనా ఎక్స్ట్రా క్లాసులు జరిగాయా?" అని అడిగింది. అజయ్ వాళ్ళ అమ్మను హత్తుకొని సంతోషంతో "అమ్మా! ఈరోజు నేను ఒక మంచి పని చేశాను. చైన్ స్నాచింగ్ దొంగలను పోలీసులకు అప్పగించాను" అని చెప్పాడు.

         లక్ష్మి సంతోషం, భయం, గాబరా కలగలిసిన స్వరంతో కొడుకును పట్టుకొని "ఏం జరిగింది నాన్న! వివరంగా చెప్పు" అని అడిగింది. "అమ్మా! నాకు ఆకలేస్తుంది. ముందు ఏమైనా పెట్టు. తీరికగా తింటూ చెబుతాను" అన్నాడు అజయ్. "అయ్యో నాన్న! నీకోసం జీడిపప్పు కలిపిన సేమియా ఉప్మా చేసి పెట్టాను. వెళ్లి ఫ్రెష్ అయ్యి రా, తిందువు" అంది లక్ష్మి. అజయ్ ఫ్రెష్ అయి వచ్చాక వాళ్ళ అమ్మ టిఫిన్ తినిపిస్తూ ఉంటే అజయ్ దారిలో జరిగిన సంఘటన అంతా వివరంగా అమ్మకు చెప్పాడు

          *************

          మరుసటి రోజు అజయ్ వాళ్ళ అమ్మానాన్నతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ వీరిని ఎంతో మర్యాదగా రిసీవ్ చేసుకుని అజయ్ చేసిన పని వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతూ ఎంతగానో మెచ్చుకున్నాడు. కిషోర్ తన సబార్డినేట్ ని పిలిచి అజయ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేయించాడు. అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడుతూ "నేను ఎస్పీ గారికి అజయ్ చేసిన సాహసం గురించి వివరించాను. ఎస్పీ గారు మిమ్మల్ని తన ఆఫీసుకు తీసుకొని రమ్మన్నారు. మనం ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్ కు వెళ్దాం" అని చెబుతాడు ఇన్స్పెక్టర్ కిషోర్.

         అందరూ కలిసి పోలీస్ వాహనంలో ఎస్పీ గారి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎస్పీ గారు తన క్యాబిన్లో అజయ్ మరియు తల్లిదండ్రులను ప్రత్యేకంగా గౌరవించారు. ఎస్పీ గారు అజయ్ తో మాట్లాడుతూ "ఇంత చిన్న వయసులో చైన్ స్నాచింగ్ దొంగలను పట్టించావు. చాలా గ్రేట్. నిన్ను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత ధైర్యంగా దొంగలను ఎలా పట్టుకున్నావో చెబుతావా" అని అడిగారు ఎస్పీ. అజయ్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం వాళ్ళింట్లో జరిగిన చర్చ గురించి ఎస్పి గారికి వివరించాడు.

          ***********

          "ఈరోజు సిటీలో ఒక మహిళ మెడలో మంగళసూత్రం అపహరణకు గురైంది. ఆ మహిళ ఎల్బీ నగర్ లోని ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా చైన్స్ స్నాచింగ్ గ్యాంగ్ బైక్ పై వచ్చి ఆ మహిళ ప్రక్కనే వెళుతూ మంగళసూత్రం లాక్కొని వెళ్లిపోయారు. ఆ మహిళ కింద పడిపోవడం వల్ల తలకు గాయమైంది. దొంగలించబడ్డ బంగారం రెండు తులాలు ఉంటుందని తెలిసింది". టీవీలో న్యూస్ రీడర్ ఆరోజు జరిగిన సిటీ క్రైమ్ గురించి వివరిస్తుంది.

         టీవీలో న్యూస్ విన్న మోహన్ భార్యతో "చూసావా లక్ష్మి! సిటీలో ఘోరాలు ఎక్కువైపోయాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరంగా తయారయింది. ఈ చైన్స్ స్నాచింగ్ గ్యాంగ్ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్తున్నాడు.

          అక్కడే ఉన్న అజయ్ నాన్నతో "నాన్న! వీళ్లను మరి పోలీసులు పట్టుకోరా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు" అని అడిగాడు. మోహన్ కొడుకు భుజంపై చేయి వేసి "చూడు నాన్నా! ఇలాంటి దొంగతనాలు చేసే వెధవలు జనసంచారం తక్కువగా ఉండే చిన్న చిన్న రోడ్లను ఎంచుకుంటారు. ఆ రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలో ఆభరణాలు దోచుకుంటారు" అని అన్నాడు. అజయ్ కల్పించుకొని "బైక్ నెంబరు నోట్ చేసుకుంటే వాళ్లను పట్టుకోవడం ఈజీ కదా నాన్న" అన్నాడు. మోహన్ అజయ్ తో "దొంగలు వాడే బైక్లు నెంబర్ ప్లేట్లు నకిలీవి ఉంటాయి. బైకులు కూడా దొంగతనం చేసినవి ఎవరో అమాయకుల పేరు మీద ఉన్న బైకులు వాడతారు. ఈ చైన్స్ స్నాచింగ్ గ్యాంగ్ చాలా జిమ్మిక్కులు చేస్తారు" అన్నాడు..

         అజయ్ వాళ్ళ నాన్నతో ఆ దొంగలు ఎలా ట్రాప్ చేస్తారు నాన్న! అంటూ కుతూహలంగా అడిగాడు. మోహన్ కొన్ని ఉదాహరణలు చెబుతూ. "చూడు అజయ్! వాళ్లలో ఒకడు అడ్రస్ అడుగుతున్నట్టు నటించి మహిళను మభ్యపెడతాడు. ఇంకొకడు ఆదమరుపులో ఉన్న మహిళ మెడలో గొలుసును అకస్మాత్తుగా బైక్ పై వచ్చి లాక్కొని పోతాడు. ఈ మహిళ షాక్ నుండి తీరుకునేలాపు మొదటివాడు పరిగెత్తుకెళ్ళి వాడి బైక్ 14-11-2024ఎక్కేస్తాడు. అలా తోడు దొంగలు ఇద్దరు ఉడాయిస్తారు. రోడ్డుపై జనం లేని సమయంలో ఎవరైనా మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తే ఆ మహిళ ప్రక్కనుండి నెమ్మదిగా బైక్ పోనిస్తారు. వెనుక కూర్చున్న వాడు మహిళ మెడలో గొలుసు లాగేస్తాడు. ఇలా రకరకాల జిమ్మిక్కులు ఆ దొంగల దగ్గర ఉంటాయి. అందుకే మహిళలు ఒంటరిగా వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేనప్పుడు బంగారు వస్తువులు ధరించకపోవడమే మంచిది" అంటాడు మోహన్ తన కొడుకు అజయ్ సందేహాలకు సమాధానంగా.

         ఆరోజు రాత్రి చైన్ స్నాచింగ్ దొంగల గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు అజయ్. మరుసటి రోజు ఎప్పటిలాగే ఉదయం నిద్ర లేచి రెడీ అయ్యి వాళ్ళ అమ్మ పెట్టిన టిఫిన్ తిని స్కూల్ కి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు అనగా నిన్న జరిగిన సంఘటనలో అజయ్ చైన్స్ స్నాచింగ్ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఇదంతా విన్న ఎస్పీ గారు అజయ్ తండ్రి మోహన్ ను అభినందించారు. చైన్ స్నాచింగ్ దొంగల గురించి సరైన అవగాహన పిల్లవాడికి కలిగించడం వల్లనే అజయ్ ఆ దొంగలను పట్టుకో గలిగాడంటూ మెచ్చుకున్నారు.

         ఎస్పీ గారు అజయ్ తో "అజయ్! నువ్వు చిన్నపిల్లాడివి కదా ఆ దొంగల్ని ఎలా పట్టుకున్నావో చెప్పు" అన్నారు. అజయ్ సమాధానం ఇస్తూ "ఆరోజు నాన్నగారు చైన్ స్నాచింగ్ దొంగల గురించి వివరించిన తరువాత ఆ రాత్రంతా నేను ఆ దొంగల గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పటినుండి నేను నా స్కూల్ బ్యాగ్ లో కొన్ని రాళ్లు ఉంచుకుంటున్నాను. చిన్నవే లెండి అని నవ్వుతూ, ఎప్పుడైనా నేను చూస్తుండగా ఇలాంటి ఘటనలు జరిగితే వేగంగా స్పందించడానికి పనికొస్తాయని ఉద్దేశంతో అలా చేస్తున్నాను" అని చెప్పాడు.

          ఎస్పీ గారు కల్పించుకొని "మరి అయితే నిన్న జరిగిన ఘటనలో నువ్వు ఈ రాళ్లతో కొట్టి వాళ్ళని గాయపరిచావా" అని అడిగారు. అజయ్ "అవును సార్ నేను నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాకు కొంచెం దూరంలో ఒక పెద్దావిడ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. నా ప్రక్క నుండి ఇద్దరు యువకులు నెమ్మదిగా బైక్ నడుపుతూ అటు ఇటు చూస్తూ కాస్త అనుమానాస్పదంగా ఆమెను సమీపిస్తున్నారు. వెంటనే నేను అనుమానంతో నా స్కూల్ బ్యాగ్ లో ఉన్న రాళ్లు చేతిలో తీసుకున్నాను. ఆ యువకులు నేను అనుమానించినట్టుగానే ఆ పెద్దావిడ మెడలో గొలుసు లాక్కుని వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు. దొంగలు గొలుసును బలంగా లాగడం వల్ల ఆ మహిళ కింద పడిపోయింది. వెంటనే నేను వరుసగా రెండు రాళ్లు వాళ్లకు గురిపెట్టి విసిరాను. అంతే సార్ వాళ్లు ఆ రాళ్ల దెబ్బలతో గాయపడి బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. నేను వెంటనే పరిగెత్తుకెళ్ళి నా స్కూల్ బ్యాగ్ తో ఇంకో నాలుగు తగిలించాను. ఈ లోగా జనం చేరారు వాళ్ల దెబ్బలు తట్టుకోలేక గొలుసు నా చేతికి ఇచ్చేశారు" అని చెప్పడం ముగించాడు అజయ్.

         ఎస్పీ గారు అజయ్ను అభినందిస్తూ "శభాష్ అజయ్! వాళ్ళని బాగానే పట్టించావు. అంతా బాగానే ఉంది. మరి ఆ రాళ్ళు గురితప్పి ఎవరికైనా తగిలితే ప్రమాదం కదా" అని అన్నారు. అజయ్ "సార్! నేను మా స్కూల్లో బెస్ట్ ఫాస్ట్ బౌలర్ని. గురి తప్పదు. ఒకవేళ తప్పినా ఇంకొకరికి తగలొచ్చు లేదా తగలకపోవచ్చు. ఎందుకంటే ఆ వీధిలో జనసంచారం పెద్దగా లేదు. అందుకే రిస్క్ చేశాను. రిస్కు చేయకపోతే దొంగలు దొరకరు కదా సార్" అని అన్నాడు అజయ్.

         ఎస్పీ గారు కుర్చీలోంచి లేచి ముందుకు వంగి అజయ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి "శభాష్ అజయ్ నువ్వు చేసిన సాహసం చాలా విలువైనది. సిటీలో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తూ పోలీసులకు తలనొప్పిగా తయారై ప్రజలను దోచుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకుని చాలా గొప్ప పని చేశావు. నేను నీ పేరును వచ్చే బాలల దినోత్సవం నాడు ప్రధానం చేసే రాష్ట్రపతి సాహస బాలల అవార్డుకు నామినేట్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాను" అన్నారు. అజయ్ మరియు తల్లిదండ్రులు సంతోషంతో ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మోహన్ మరియు లక్ష్మి తమ బిడ్డ అజయ్ ను తనివితీరా ముద్దుపెట్టుకొని మురిసి పోయారు.

コメントの追加

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)