ఇద్దరమే  (Author: జడా సుబ్బారావు)

ఉండేది ఇద్దరమే నీకో గది నాకో గది ప్రమాణం అపరిచిత ప్రయాణం

పెదాలు కదలడం మానేశాయి గోడలు అడ్డంగా నిలబడ్డాయి

చూపులు కలవాల్సిన శుభవేళలన్నీ చురకత్తులై వెంటాడుతున్నాయి

మనసులు కలవాల్సిన మధుర క్షణాలన్నీ మౌనంగా ఉరికి వేలాడుతున్నాయి

జీవిత పయనానికి నువ్వో చక్రం నేనో చక్రం దారెందుకో ఇరుకుగా గరుకుగా ఉంది

ఉండేది ఇద్దరమే నీదో దారి నాదో దారి దాంపత్యం దగ్ధమైపోతోంది!

***

コメントの追加