Article
ప్రేమ మత్తులో (Author: పెద్దాడ సత్య నారాయణ)
1. మది అనే గదిలో, ప్రేమ చిగురిస్తే
అల్లరి చేద్దాము ఛలో అని
మనస్సు పరుగులు తీస్తుంది
యెదనిండా, ప్రేమ ఉందని
ఇంద్ర ధనుస్సు మాదిరి
రంగుల జీవితము సొంతము అనే
తీపిమాటలు నీటిమీద రాతలని
గ్రహించవే చెలి
2. యవ్వనంలో అందమైన ప్రేమకలలు
కనడము మానవ సహజము
స్వచ్చమయిన, నిస్వార్ధమయిన
ప్రేమని గుర్తించడము కూడా ఒక కళే
చిరు ప్రాయము నుంచి, ఉగ్గుపాలు
మురిపాలు, ఆనందాలు పంచిన
కన్నవారు, శ్రేయాభిలాషులు హెచ్చరించిన
అన్నీ నాకే తెలుసు ననే భ్రమలో
తప్పటడుగులు వేయకే చెలీ
నిజాన్ని గ్రహించి, అందమయిన జీవితాన్ని
చేజార్చు కోవద్దు చెలీ
3. నవ తరము సాంకేతిక మాధ్యమాల
పరిచయాలు, ప్రేరణలు నిజమని
నమ్మవద్దు. ఆర్ధిక నేరాలు కోకొల్లలు
జరిగే వాస్తవాలు గ్రహించవే చెలీ