శుభ సంక్రాంతి  (Author: వింజమూరి శ్రీవల్లి)

ఉషోదయపు తొలి కిరణం

సర్వజన హృదయ హారం

భువనైక విశ్వనేత్ర దినకరం

       మకర సంక్రమణం

 

రంగులద్దిన రంగవల్లి వాకిళ్ళు

చిరు నవ్వు చిన్నారుల భోగిళ్ళు

పాడిపంటలు అరుదెంచె లోగిళ్ళు

        సంతోషాల హరివిల్లు

 

గగనాన పతంగుల హోరు

భువనాన కోడిపందాల జోరు

గొబ్బెమ్మల పడుచుదనపు తీరు

భోగి మంటలతో ఎగిసే కాంతి

భోగభాగ్యాలందించే మకర క్రాంతి

బంధాల అనుబందాల మధురక్రాంతి

        శుభ సంక్రాంతి

Lisää kommentteja