యుద్ధకాండ  (Author: మల్లారెడ్డి మురళీ మోహన్)

యుద్ధకాంక్ష దేశాలతో ఆడుకుంటూ

బక్కపల్చని వీపులపై అస్త్రాల

బరువుని మోపుతోంది

యుద్ధ మేఘాలు కరిగి

అవిరామంగా అవనిపై

నెత్తురు కురుస్తోంది

ఎగిసే యుద్ధ జ్వాలలకర్ధం

అగ్ర రాజ్యాలు రొట్టెలు కాల్చుకునేందుకు

పొయ్యి రాజేస్తున్నాయని

కంచెకవతల యుద్ధవ్యాఘ్రం

పొంచి ఉన్నది, దుర్బల దేశాల

కలలు కాజేయ్యడానికని

యుద్ధమంటే, అగ్రరాజ్యాల

క్షిపణి విపణి వికాసానికి

నిత్య కార్యక్షేత్రం

యుద్ధమంటే బలవంతుడికి వ్యసనం

పీడితుడి ఆత్మగౌరవ పోరాటం

యుద్ధావశేషాలుగా మిగిలేవి

విధ్వంసమైన ఆస్తులు, కట్టడాలే కాదు

ఛిద్రమైన అనాధ కుటుంబాలు

యుద్ధానంతర దృశ్యాలుగా

చరిత్ర గోడలపై ఎప్పటికీ

చెరగని రక్తపు మరకలు

యుద్ధం ప్రసవించిన

ప్రేత ప్రవచనాల శకలాలు

గుచ్చుకుని మట్టి గాయపడుతోంది

యుద్ధ విరమణ అని

భ్రమసిన పావురం ఇంకా

సరిహద్దుల్లోనే ఎగురుతోంది

బలవంతుడికి వ్యసనం

పీడితుడి ఆత్మగౌరవ పోరాటం

యుద్ధావశేషాలుగా మిగిలేవి

విధ్వంసమైన ఆస్తులు, కట్టడాలే కాదు

ఛిద్రమైన అనాధ కుటుంబాలు

యుద్ధానంతర దృశ్యాలుగా

చరిత్ర గోడలపై ఎప్పటికీ

చెరగని రక్తపు మరకలు


Lisää kommentteja