యుద్ధం వద్దు శాంతే ముద్దు
యుద్ధం వద్దు శాంతే ముద్దు (Author: పి లక్ష్మీ ప్రసన్న)
యుద్ధం వస్తే భయమే మిగులుతుంది
కత్తులు దూసుకుపోతాయి
తుపాకులు మోగుతాయి
రణం రక్తపు వర్షాన్ని కురిపిస్తుంది
ఈ యుద్ధంఎందరో ప్రాణాలు
తీసే ఒక రాక్షసి
ఎన్నో కుటుంబాలను
అనాధలను చేస్తుంది
ఎందరో మహానుభావులను
తన పొట్టను పెట్టుకుంది
కదనంలో గెలిచినవారు ఎంతో
ఆనందపడతారు కానీ
ఆ కదనరంగంలో చనిపోయిన వ్యక్తి
కుటుంబం ఎంత బాధ పడుతుందో
గుర్తించరేం?
అటువంటి యుద్ధం వద్దంటే
ఒకే ఒక మార్గం అదే శాంతి మార్గం
అది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది
కాబట్టి మన గుండెల్లో శాంతి మాత్రమే నిలవాలి
యుద్ధం ఒక చెడు కలగా మిగిలిపోవాలి
శాంతి ఒక నిజమైన వెలుగు
అందుకే శాంతిని కాపాడుకుందాం!
ప్రేమతో ప్రపంచాన్ని నింపుదాం!
జీవితంలో శాంతి వెలుగులను నింపుకుందాం.
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)