ఒంటరి విజయం  (Author: గారపాటి సూర్యనారాయణ)

నా కంటే ముందే, అక్క ఈ భూమ్మీదకొచ్చినప్పుడు

ఆ కొద్ది సేపు, అమ్మ కడుపున ఒంటరినయిన ఫీలింగ్

 

ఏడుస్తున్న అక్కను, అమ్మ అక్కున చేర్చుకున్నప్పుడు

తదుపరి ఓదార్పు నాకేనని తెలిసినా, ఒంటరినయిన ఫీలింగ్

 

ఒంట్లో బాగోక అక్క, ఇంట్లోనే ఉండిపోయినప్పుడు

స్కూల్లో ఎందరో నా ప్రక్కనే ఉన్నా, ఒంటరినయిన ఫీలింగ్

 

చదువులో చురుకు లేక, ఒక క్లాసు వెనుకబడినప్పుడు

ఇన్నేళ్లుగా కలిసి చదివిన అక్క లేక, ఒంటరినయిన ఫీలింగ్

 

అర్థాంతర పెళ్ళితో, అక్కను అత్తారింటికి పంపేసినప్పుడు

పుట్టుక తోడు నాకిక లేదని తెలిసి, ఒంటరినయిన ఫీలింగ్

 

చదువు సాకుతో, ఇంటి నుండి దూరంగా వదిలేసినప్పుడు

నా చిన్ని ప్రపంచం నా నుండి వేరై, ఒంటరినయిన ఫీలింగ్

 

భారమైన చదువు బాధ, బంటుగాణ్ణి మింగేసినప్పుడు

నాకున్న ఏకైక మిత్రుడు దూరమై, ఒంటరినయిన ఫీలింగ్

 

ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు, ఛీత్కరించినప్పుడు

నా లోకం అంధకార బంధురమై, ఒంటరినయిన ఫీలింగ్

 

నా దేహంలో సగమైన అర్థాంగి, స్వర్గానికేగినప్పుడు

తోడు లేని బతుకు తెల్లారే దారి లేక, ఒంటరినయిన ఫీలింగ్

 

జీవన గమనంలో, ఎడారి పయనం నా వెంటే నిలుస్తుంది

నా అడుగులో అడుగై, ఒంటరితనం వెన్నంటే తరుముతుంది

ఒంటరిగా నిలుస్తున్న ప్రతి తరుణం, వెనువెంటనే మారుతుంది

సరిక్రొత్త తోడు రాకతో, మరో ఉదయం ప్రారంభమవుతుంది

 

ఆఖరి తోడును కోల్పోయిన నిజం, నాకిపుడు అవగతమవుతుంది

మరల మార్పు రాబోదను సత్యం, నగ్నంగా కనుపిస్తుంది

 

అయినా....

చిట్టచివరి శ్వాస వరకు, ఆనందంగా గడిపేస్తాను

ఈ లోకాన్ని ఒంటరి చేసేసి, విజయంతో అస్తమిస్తాను

1 Kommentti

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)