అయోధ్య  (Author: ఉయ్యాల దేవి మేధశ్రీ)

స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయమది

నా మదిలో హఠాత్తుగా ఒక ఆలోచన మొదలైంది

వీళ్ళతో నాకున్న బంధాన్ని

వదిలి ఇక వెళ్లాలా

అలా నాలో ఒక ప్రశ్న మొదలైంది

నాకు నా మిత్రులతో ఉన్న

గొడవలు ఆప్యాయత గణించలేనిది

మా గురువులతో నాకున్న అనుబంధం

జీవితంలో మరువలేనిది

వారు నా మీద పెట్టిన అనురాగానికి

అందనంత దూరంగా వెళ్లి పోతున్నాం

ఆ రాముడు అయోధ్యను విడిచి

14 సంవత్సరాలు దూరమయ్యాడు

కానీ మాకు పాటని నేర్పిన అయోధ్యను మాత్రం

శాశ్వతంగా దూరం అవుతున్నాం

ఇక మాకు మిగిలింది ఐదు నెలలే

ఈ పవిత్రమైన అయోధ్యలో మా కాలం

ఈ లోగా ఎవరికీ లేని తీపి గుర్తులు

పెంచుకొని పంచుకొని వెళ్తామేమో

అని అనుకుంటేనే నా కంట్లో నీళ్లు

సుల్లు  తిరుగుతున్నాయి

కళ్ళు మసక బారిపోతున్నాయి.........


Lisää kommentteja