అధ్యక్షుని కలం నుండి…  (Author: అన్నా మధుసూదన రావ్)

తెలుగు జ్యోతి పాఠకులకు నమస్కారం!
2024-26 సం|| లకు TFAS అధ్యక్షునిగా నాకు అవకాశమిచ్చిన ప్రియ సభ్యులందరికీ నా వినమ్ర నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను.   ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా TFAS ని వేరొక స్థాయికి తీసుకు వెళ్లి న్యూ జెర్సీ తెలుగు ప్రజలకి TFAS మీద ఉన్న అభిమానాన్ని, ఆదరణను అమోఘమైన చక్కటి కార్యక్రమాలతో ఎన్నో రెట్లు పెంచిన శ్రీ మధు రాచకుళ్ల గారూ, వారి కార్యవర్గ సభ్యులకు నా అభినందనలు. గత కార్యవర్గం చేసిన కార్యక్రమాల్ని TFAS చరిత్రలో ఒక పదిలమైన స్థానాన్ని ఏర్పరిచాయని ఘంటాపథం గా చెప్పగలను. 

తెలుగుజ్యోతి సంపాదక వర్గ సభ్యలుగా వ్యవహరించిన మహానుభావులందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు.  తెలుగుజ్యోతి పత్రిక ద్వారా TFAS ముఖ్యోద్దేశమైన తెలుగు భాషా ప్రోత్సాహాన్ని నిర్వహిస్తున్న వారి ప్రయత్నాలు ప్రశంసనీయం. 

నా వైపు నుండి మీ అందరికీ ఒక ముఖ్య విన్నపం.  తెలుగు మీద మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ వారి భాషా కౌశల్యం, పట్టూ ఎలా వున్నా సరే తమ తమ రచనల్ని తెలుగు జ్యోతికి పంపవలసింది గా కోరుతున్నాను.   అలాగే మీ పిల్లల్ని కూడా తెలుగు చదవడం, వ్రాయడం ప్రోత్సహించండి.  వాళ్ళ రచనల్ని కూడా తెలుగు జ్యోతికి పంపించ ప్రార్ధన. 

త్వరలోనే వస్తున్న వనభోజన కార్యక్రమం లో కలుద్దాం!!

భవదీయుడు,
అన్నా మధు 
President, TFAS

Añadir comentarios