నువ్వో స్వయంకృతాపరాధివి  (Author: చింతలపట్ల కళా గోపాల్)

జీవమైనా.. నీ జీవితపయనమైనా/

సాగిపోయేది ఆగిపోయేది నాలోనే..నాతోనేనని తెల్సినా/

కాకులు దూరని కారడవుల్ని మాయం చేస్తూ /

కొండల్ని బండల్ని పిండి చేశావు/

 

అమెజాన్ పొత్తిలిలో చిచ్చు పెట్టి../

మంచుదిబ్బల్ని మరిగించి ఎల్ నినోల్ని సృష్టించావు/

మైదానాల్ని మాగాణుల్ని స్వాహా చేస్తూ/

సాగరజలాల్లో ప్లాస్టిక్ గుట్టల్ని నిర్మించావు/

 

క్యుములోనింబస్ లను తరిమేసి/

చెత్త పర్వతాలు వెదజల్లే హైడ్రోకార్బన్స్ లతో రాకాసి జబ్బుల్ని అంటించి/

యురేనియం ధూళిపొగలతో నిండు జీవితాల ఊపిరి తీశావు!/

 

ఆహారపు గొలుసును పుటుక్కున తెంపి/

జలచక్రాన్ని దారి మళ్ళించావు/

అవని అంతా ఆమ్లవర్షాల్ని కురిపిస్తూ/

ఫ్లోరైడ్ నీటితో వంకర వేళ్ళను విస్తరించావు/

 

అదనపు దేహం పెంచలేని నా పరిమితి తెల్సీ/

గుక్కెడు నీళ్ళ ఊటా, చారెడు మెతుకులనిచ్చే/

అక్షయపాత్రను చేజార్చుకున్న అనాగరికుడా!/

 

పరిగెత్తిన మేరా నాదేనన్న దురాశతో సత్తువ సన్నగిల్లగా../

ప్రాణవాయువులింకిన సిమెంటు రాస్తాలలో /

అలసట చెందితే..ఇప్పుడే చెట్టునీడన కూలబడతావు?/

 

నేలతల్లి ఉసురు తగిలి నీ కుతంత్రాల బుర్ర/

వేయివక్కలవక మునుపే..

ఒక మొక్కైనా నాటి "మళ్ళీ చిగురించు..!"/

ఊడల ఉచ్చు బిగిసి నీ దేహపుటాకు/

మోడుగా మారక మునుపే..

వటవృక్షమై మళ్ళీ మొలకెత్తు..!!/

 

Añadir comentarios

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)