దేశమంటే యుద్ధం కాదోయ్  (Author: జడా సుబ్బారావు)

           ఇప్పుడు దేశం శ్వాస నిండా దిగులు మేఘం కమ్ముకుంది

పీల్చే గాలి నిండా యుద్ధ భయం ముసురుకుంది

దేశమంటే మట్టికాదోయ్ నినాదం నిన్నటి కథ

దేశమంటే యుద్ధమేనోయ్ వివాదం  రేపటి వ్యథ!

 

           కళ్లనిండా ముళ్లకంచెలు గుండెనిండా రాతిగోడలు

          కాళ్లనిండా ఇనుప గొలుసులు ప్రపంచమొక మానని గాయంగా

          యుద్ధమొక తీరని శోకంగా రూపాంతరం చెందుతూనే ఉంది!  

 

          శాంతి వచనాల ఖననం సమానత్వ భావాల దహనం

           దేశాలకు నిర్వచనంగా మారిపోయింది

           దేశమంటే మట్టీ కాదు, యుద్ధమూ కాదు!

 

          అహం గోడలపైన మనిషితనం మొలకెత్తాల్సిన స్థలం

          రాతి గుండెల్లో మానవత్వ ధారలు కురవాల్సిన తరుణం!

Añadir comentarios