గర్భస్థ శిశువు  (Author: ఓట్ర ప్రకాష్ రావు)

అమ్మా, నీ కడుపులో వున్నంతవరకు నాకు రక్షణ అనుకొన్నాను.   

        కానీ  క్షణ క్షణం నేను అనారోగ్యానికి గురవుతున్నాను

నా పైనున్న  నీ ప్రేమకు మురిసిపోయాను.

           నీలో  అమాయకత్వం  చూసి  కృంగిపోతున్నాను.

 ఎల్లవేళలా  నీ తోనే ఉంటున్న స్మార్ట్ ఫోన్  గమనించాను  .

           ఫోన్ రేడియేషనుతో  మెదడులోని   ప్రకంపనలు తట్టుకోలేకపోతున్నాను.

సూర్య గ్రహణం రోజు నాకోసం చీకటి గదిలో వుండటం సంతోషంతో  గమనించాను.

           నాకు  హాని కలిగించే జంక్ ఫుడ్  ప్రతిరోజూ తింటుంటే బాధపడ్డాను.

   మనసుకు  ప్రశాంతత కలిగించే  పుస్తకం చదువుతావనుకొన్నాను.

            నీవు చూస్తున్న టీవీ నాటకములు వింటూ భయంతో వణికిపోతున్నాను

నేను  అనుక్షణం ఉత్సాహంతో ఆరోగ్యంగా ఎదగాలనుకొన్నాను.

            నీ  నడవడికతో  నేను నిరంతర  రోగిలా  కృంగిపోతున్నాను.   

నా ఆలోచనలు  నీకు   చెప్పాలని ఆరాటపడ్డాను 

           ఎలా చెప్పాలో తెలియక  నా మనసులోనే వేదన చెందాను

పేగుతెంచుకొని  వచ్చి నిన్ను చూడాలని ఆశపడ్డాను .

               నీ అవగాహన లోపంతో   మరణించిన శిశువులా రాబోతున్నాను.

  అమ్మా చివరిగా నేను కోరుకొనేది ఒక్కటే,

                 అవగాహనతో, డాక్టరు ఆదేశాలతో  నీవు ఒక బిడ్డకు తల్లి కావాలి.  

Añadir comentarios