'సామెతలు' 3వ విడత
'సామెతలు' 3వ విడత (Author: మండా వెంకట అప్పారావు)
చ
చంకపిల్ల జారిపడేటట్టు మాట్లాడుతాడు
చక్కదనానికి లొట్టిపిట్ట, సంగీతానికి గాడిద
చక్కిలాలు తింటావా, చల్ది తింటావా అంటే, చక్కిలాలు తింటాను, చల్దీ తింటాను, అయ్యతోటి వేడి అన్నమూ తింటాను అన్నాడట
చక్కెర పూత పూసిన విషము
చచ్చిన చారమేకపాలు పోయిన బోసిముంతెడు
చచ్చిన వా ని కళ్ళు చేరడు
చచ్చినవాని పెండ్లికి వచ్చినంత కట్నము
చచ్చేదాకా బ్రతికి వుంటే పెండ్లి చేస్తానన్నట్టు
చచ్చేవానికి సముద్రము మోకాలి బంతి
చదవ వేస్తే వున్న మతి పోయినది
చదివినవాని కన్న చాకలవాడు నయము
చదివేది రామాయణము, పడగొట్టేవి దేవ స్థలాలు
చదువు మా ఇంట లేదు, సంధ్య మా వంశాన లేదు
చద్దికంటే వూరగాయ ఘనము
చద్దికూడు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరగదు
చద్ది తెచ్చుకున్నా బ్రాహ్మణుడా భోజనము చెయ్యి
చన్నీళ్ళయినా చల్లార్చుకొని తాగవలెను
చలిపండితి కుండలకు తూట్లు పొడిచినట్టు
చలిపండితి కుండలలో రాళ్లు వేసినట్టు
చల్లకు వచ్చి ముంత దాచుకున్నట్టు
చవక అయితే బజారుకు వస్తున్నది
చస్తానని చద్ది అన్నము తింటే, చల్లగా నిద్ర వచ్చిందట
చా అంటే, తూ అనలేడు
చాకల అత్తా, మంగలి మా మ
చాకలవాని భార్యకు మంగలివాడు విడాకు యిచ్చినట్టు
చాప చిరిగితే చదరంట అయినా వుండకపోతున్నాడా
చాలీ చాలనందుకు చాకింత గుడ్డలు సానా వున్నవి
చవటి ముందరి కొంప కడప పుల్లలకు సరి
చావా చావడు, మంచమూ వదలడు
చావా చావనివ్వడు, బ్రతకనివ్వడు
చావుకు పెట్టితే గానీ, లంఖనాలకు
చావుకు మళ్ళీ చావు వస్తుంది
చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు
చింత చచ్చినా, చింత పులుపు చావదు
చింతా చిగిరింత యేపు
చికిలింత ఐశ్వర్యం
చిక్కి సిగిలించెతంత కన్నా, వెళ్లి వెక్కిరించెడి మేలు
చిచ్చాయ చిచ్చాయ అంటే, సందాయే సందాయే అన్నట్టు
చిత్త చిత్తగించి స్వాతి దయచేసి విశాఖ విసిరి కొట్టకుంటే, వీశానికి పుట్టెడు పండుతాను అన్నాడట
చిత్తము శివునిమీద, భక్తి చెప్పులమీద
చినపేరీతాడు తెగితే, పెదపేరీతాడు అప్పుడే తెగుతుంది.
చిన్నక్క చిలక, పెద్దక్క గిలక, చూస్తే చుక్క, రేగితే కుక్క.
చిన్నపాయమైన, పెద్ద కర్రతో కొత్త వాలెను. పామైనా
చిన్నమూ కావాలె, చిదరా కావాలె, మేలిమీ కావాలె, మేడ తిరగవాలె. మెడ
చిలక తన ముద్దే గాని ఎదటి ముద్దు కోరదు
చిలక ముక్కున దొండపండు వున్నట్టు
చిలుము వదిలితే, చిత్రం వదులుతుంది
చిలిపిరే తూటు
చీకట్లో జీవరత్నము
చీపురు కట్టకు పట్టుకుచ్చు కట్టినట్లు
చీర కట్టినమ్మ శృంగారము చూడు, గుడ్డ కట్టినమ్మ కులుకు చూడు
చీర పిట్టకు దొమ్మ తెగులు
చీర సింగారించేటప్పటికి పట్నమంతా చూరబోయినట్టు
చుట్టమని చూడవస్తే, యింటి వారంతా దయ్యాలై పట్టుకొన్నారట
చుట్టు చూరుమంగళం, నడమ జయమంగళం
చూచినది పాము, కరిచినది మామిడి టెంక
చూచినదెల్ల సుంకము, పాసినదెల్ల పంకము.
చూడగా చూడగా గుర్రము గాడిదే అయినది
చూడ చూచెలుక, గోడలుతవ్వ పందికొక్కు
చూడ చుట్టమూ, మొక్కని దైవమూ లేదు
చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు
చూడ వచ్చిన వారికి శుక్రవారమేమి
చెంబూ కంచమూ పోతే, ముఖము మీద కొట్టినట్లు ముంతా చెంబూ మూకూడూ తెచ్చుకో లేనా
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా
చెట్టుకొట్టి పాయికి తెచ్చుకొన్నట్టు
చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పెట్టుచున్నవి
చెట్టు పెట్టిన వాడు నీళ్ళు పొయ్యడా
చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టు
చెట్టు యెక్కించి నిచ్చెన తీసినట్టు
చెట్టు ఎక్కేవాణ్ణి ఎందాకా తొయ్య వచ్చును
చెడిపోయిన బ్రాహ్మణుడికి చచ్చిపోయిన ఆవును దానము చేసినట్టు
చెడి స్నేహితుని యింటికి వెళ్ళవచ్చునుగాని, చెల్లి యింటికి వెళ్ళకూడదు
చెడేవాడు అబ్బడున్నాడు, మరీ పిడికెడు తేరా దానము చేస్తాను అన్నాడట
చెడ్డ చేనుకి మూడు మంచెలా?
చెడ్డ చేనుకి యింటి వడ్లు పొంగలా?
చెప్పినంత చేసేవారు శివునికన్నా వేరే ఎవరూ లేరు
చెప్పిన బుద్ధీ, కట్టిన చద్దీ నిలవదు
చెప్పుకింది తేలు
చెప్పుడు మాటల కన్న తప్పుడు మాటలు నయము
చెప్పులు తొడుగుకొన్న వాడికి లోకమంతా తోలుతో కప్పబడ్డట్టు తోస్తున్నది
చెప్పే వాడికి సిగ్గు లేకపోతె, వినే వాడికైనా వివేకము వద్దా?
చెయ్యి చూపి అవలక్షణము అనిపించుకొన్నట్టు
చెరపకురా చెడేవు, వురకకురా పడేవు
చెరుకా బెల్లము పెట్టుమంటే పెట్టునా
చెరుకు తినడానకు కూలి యివ్వ వలెనా
చెరుకు తీపి అని వెళుతూ నమలవచ్చునా
చెరుకు వంక పోతే తీపు చేదునా
చెరువు మీద అలిగి కాళ్లు కడుక్కోక పోయినట్టు
చెల్లీ చెల్లడములకు సెట్టిగారు వున్నారు
చెవిటి పెద్దమ్మా చేంతాడు తేవే అంటే, చెవుల పోగులు నా జన్మలో యెరగనన్నాదట
చెవిటి వాడికి శంఖము వూదితే, అది కొరకడానికి నీ తండ్రి తాతల తరము కాదన్నాడట
చెవుడు చెవుడూ అంటే, తవుడు తవుడూ అంటాడు
చెవ్వాకు పోయినమ్మకు యెంత వ్యసనమో, దొరికినమ్మకు అంత సంతోషము
చేదు తింటారా చెట్లు కొడతారా
చేనిపంట కొయ్యగాలే చెప్తుంది
చేనిలో పుట్టిన బీడు యెక్కడికి పోను
చేనూ కొడవలీ నీ చేత యిచ్చినాడు
చేప పిల్లకు యీత నేర్ప వలెనా
చేలోపత్తి చేలో వుండగానే, పోలికి మూడు మూళ్ళు నాకు ఆరు మూళ్ళు అన్నట్టు
చేసిన పాపము చెపితే మానును
చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా
చేసేది బీద కాపరము, వచ్చేవి రాజభోగాలు
చేసేవి నాయకులు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు
చేసేవి శివపూజలు, చెప్పేవి అబ్బద్ధాలు
ఛ
చిద్రమునకు చీరవేలు, దరిద్రమునకు తలపేలు
జ
జంగానికి బిడ్డలు పుట్టితే, వూరికి ఉపాధి
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమెందుకు
జడ్డిగాములో మిడతపోటు
జయము వుండే వరకు భయము లేదు
జాతి కొద్దీ బుద్ధి, కులము కొద్దీ ఆచారము
జానెడు యింట్లో మూరెడు కర్ర
జీతగాణ్ణి తెచ్చుకొంటే, యింటికి ఖామందు అయినాడు
జీతములేని నౌకరు, కోపములేని దొర
జీతమూ బత్యము లేకున్నా తోడేలు మేకలు కాస్తానన్నట్లే
జోగీ జోగీ రాసుకుంటే బూడిదే రాలినది
జీవరత్నం యిట్టిదని పొగిడితే, రత్నానికి యేమి లోపము
జీవన్మ్రుతుడు, మృ త జీవుడు
జ్ఞాతిగుర్రు అరిటికర్రు వదలవు
డ
డబ్బు యివ్వనివాడు ముందు పడవ యెక్కినట్లు
డబ్బులేని వాడికి బోగముడి తల్లి వరస
డొంకలో షరావు వున్నాడు, నాణెము చూపుకోవచ్చును
త
తంగేడు పూచినట్టు
తంటాల మారి గుర్రముకు తాటిపట్టె గౌరవం
తండ్రి తవ్విన నుయ్యి అని అందులోపడి చావ వచ్చునా
తంబలి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
తక్కువ నోములు నోచి యెక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
తాగినట్టే కూర్చేరా తాకట్లమారి బ్రహ్మ
తగిలినా కాలే తగులుతుంది
తాగు దాసరికీ మేడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య యిచ్చిన మనుముకూ
తడకలేని యింట్లోకి కుక్క దూరినట్లు
తడిగుడ్డలతో గొంతుక తెగకొస్తాడు.
తడిసికొని గుడిసె కట్టాడు, తాకిగాని మొగ్గడు
తడిసిన కుక్క బిగించినట్టు
తడిసి ముప్పందుం మోసినట్లు
తణుకు పోయి మాచవరం వెళ్లినట్టు
తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
తనకంపు తనకింపు, పరులకంపు తనకు వెకిలింపు
తన కలిమి యింద్రభోగము, తనలేమి లోకదారిద్యము
తన కళ్లకు అందాలు తానే తెచ్చుకున్నట్టు
తనకు అని తవ్వెడు తవుడు ఉంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
తనకు కానిది గూడులంజ
తనకు చెప్ప తడికెలచాటు వొకరికి చెప్ప వొప్పుల కుప్ప
తనకు మాలిన ధర్మము, మొదలు చెడ్డ బేరము
తన కొంగున వున్న రూక తన కడుపున పుట్టిన బిడ్డా పనికి వస్తవి
తన చెయ్యి కాలుతుందని సవిటి బిడ్డ చేతితో కలియబెట్టినాడట
తన తలుపు తీసి పొరుగింటికి పెట్టి రాత్రి అంతా కుక్కలు తోలుతూ కూర్చున్నట్టు
తన తల్లి చావు కన్నా పిన తల్లి చావు మేలు
తన నీడ తనతోనే వున్నది
తనను పొడిచిన గంగిగోవునయినా పొడిస్తే పాపములేదు.
తన పిల్ల తవిటికి యేడిస్తే, లంజ పిల్ల రవికెకు ఏడ్చినది
తన పుట్టి పిచ్చగా వుంటే, పొరుగు పండుము పారా కొలిచినాడట
తన బలిమి కన్నా స్థాన బలిమి మేలు
తన ముడ్డి కాకపోతె గంగదాక దేకుమన్నట్టు
తనవారు లోతుకు తీతురు, కానివారు కడకు తీతురు
తాన వాళి తప్పితే, వొక వన్నె తరుగును
తన్నే కాలికి రోలు అడ్డమయినట్టు
తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు ఓర్వలేని వాడు
తప్పులేని వారు ధరణిలో లేరు
తప్పూ వొప్పు దైవమెరుగును, పప్పు కూడు బాపడెరుగును
తలకింది కొరివి
తలకు మించిన అజ్ఞ లేదు
తల కోసి ముందర పెట్టితే, గారడీ విద్య అన్నట్టు
తలగడ కింది పాము
తల తడిసిన మట్టుకు గొరికే తీరవలెను
తల ప్రాణము తోకకు వచ్చినది
తలలు బోదులయితే తలపులు బోదులా
తలా తోకా లేని కథ, ముక్కూ ముఖము లేని పిల్ల
తలారి పగ తలతో తీరుతుంది
తలుపులు మింగే వానికి అప్పడాలు లొట లొటలు
తల్లి అయిన ఏడవనిదే పాలివ్వదు
తల్లి కడుపు చూచును, పెండ్లాము వీపు చూచును.
తల్లి కడుపులో చేరక ముందు దయ్యాలదేవత, భూమిలో పుట్టిన తర్వాత యమదేవత
తల్లికి కానివాడు దాది కావునా
తల్లికి కూడు పెట్టనివాడు తాగుడు తగుదునని తగువు తీర్చ వచ్చినట్టు
తల్లికి కొత్త వసంతము
తల్లికి తగిన బిడ్డా, యింటికి తగిన పందిరి
తల్లిగండము పిల్లగండము వున్నది గాని, మంత్రసాని గండము వున్నదా
తల్లి చనిపోతే తండ్రి పినతండ్రితో సమానము
తల్లిచేస్తే కడుపు పెద్ద, తలమస్తే కొప్పు పెద్ద
తల్లి చెవులకన్నా పినతల్లి చెవులే మేలు
తల్లి చెవుల మద్దికాయలు దండగలకు, భార్య మెల్లో పూసలు భోగాలవారికి
తల్లిచెవులు తెంచిన వాడికి ముత్తవ్వతల్లి చెవులు వెంట్రుక మాత్రమే
తల్లిదేవి వాళ్లపక్షము, ధరణిదేవి వాళ్లపక్షమే
తల్లి దైవము, తండ్రి ధనము
తల్లిని చూచి పిల్లనూ పాడిని చూచి బర్రెనూ తీసుకోనవలెను
తల్లి పుట్టిల్లు మేనమామ వద్ద పొగిడినట్టు
తల్లి లేని పిల్ల వుల్లి లేని కూర
తవుడు తింటూ వయ్యారమా
తవ్వగా తవ్వగా తథ్యం తెలుపుతోంది
తవ్వి మీద తోసుకున్నట్టు
తాగబోతే దప్పికి లేదు, తలకు అతకాలి
తాగేది దమ్మిడీ గంజాయి, యిల్లంతా చేదు ఉమ్ములు
తా చెడ్డ కోతి వనమెల్ల చేరినది
తాటాకు చప్పుళ్లకు కుందేళ్ళు బెదురునా
తాటి చెట్లలో ప్రొద్దు గూకినట్టు
తాటి పట్టెకు యెదురు దేకినట్లు
తాడు చాలకపోతే నుయ్యి పూడ్చుమన్నట్టు
తాడెక్కెవన్ని యెండకా యెగసన తొయ్యను
తాతకు దగ్గు నేర్పవలెనా
తాతాచార్యుల ముద్ర భుజము తప్పిన వీపు తప్పదు
తాత పెండ్లాడుతావా అంటే, నాకెవడిస్తరురా అబ్బా అన్నాడట
తాడిన తవుడు లేదు, వారానికి ఒక పందిపిల్ల
తానుండేది దాళిగుంట పట్టు, తలచెవి మేడ మాలిగలు
తనుచేసిన పాపం తనువుతో, తల్లిచేసిన పాపం ధరణితో
తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు
తను పట్టిన కోడికి నాలుగు కాళ్ళు
తాను పెంచిన పొట్టేలు తన చేతనే చంపబడ్డట్టు
తను బోను దోవలేదు డోలు ఒకటి మెడను
తానూ గాక పిల్లి కూడానా
తానూ వక మనిషినా తవుడూ ఒక రొట్టెనా
తానే తుమ్మి తానే సతాయుష్షు అనుకున్నట్టు
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినది
తావుల గొడ్డుకు రోలడ్డము
తాబోతు బొల్లి ఎద్దుకి కుడితి
తామరాకులో నీళ్ళు తల్లదించినట్టు
తాలిమి తన్నూ కాచును యెదిరినీ కాచును
తాళ్లకు తలను చండ్లు మేకలకు మెడను చండ్లు
తాళ్లపాకవారి కవిత్వము కొంత, తన పైత్యము కొంత
తాళ్లు తన్నెవారి తలలు తన్నెవాడు
తావలసినది రంభ, తాములిగినది గంగ
తింటే కదలలేను, తినకపోతే మెదలలేను
తింటేగాని రుచి తెలియదు, దిగితేగాని లోతు తెలియదు
తిండికి చేటూ నేలకు బరువూ
తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
తిండికి వచ్చినానా, తీర్థానికి వచ్చినానా
తిట్టి చచ్చినవాడు లేడు, దీవించి బ్రతికినవాడు లేడు
తిట్టుగాదురా తొత్తు కొడకా
తినమరిగిన ప్రాణము అల్లాడి చచ్చినది
తిన్న కుక్క తిని పోతే, కన్న కుక్కను పట్టి కాళ్ళు విరగకొట్టినట్లు
తిన్ననింటి వాసాలు యెంచుతావేమిరా అంటే, పొరిగింటికి పోతే వూరుకుంటారా అన్నాడట
తిన్నన్యింటి వాసాలు యేనెవాడు
తిన్నయిల్లు గుడ్డలించేవేమిరా అంటే, తినని యిల్లు నేనేమి యెరుగుదును అన్నాడట
తిన్నవాడే మన్నవాడు, మన్నవాడే మహారాజు
తిమ్మన్న పంటికి తియ్యచారు అన్నము
తిమ్మిని బ్రహ్మిణి, బ్రహ్మిణి తిమ్మిని చేస్తాడు
తియ్యగా తియ్యగా రాగము, మూలగగా మూలగగ రోగము
తిరగ మరిగిన కాలు తిట్ట మరిగిన నోరు వూరకుండదు.
తిరపతికి పోగానే తురక దాసరి అవునా
తిరపతి మంగళవాడి వట్టు
తిరిపెపు మజ్జిగాకు వచ్చి పాడి బర్రెను బేరము చేసినట్టు
తిలః పాపహారా నిత్యం, తలా పిడికెడు పిడికెడు
తీగెకు కాయ బరువా
తీగెకు కాయ బరువా
తీగె పట్టుకుంటే, పొద అంతా కదిలినట్లు
తీత పట్టినవాడు గోకుకుంటాడు
తుంటిమీద కొట్టితే పండ్లు రాలినవట
తుడుం తుడుం అంటే, దురయి దురయి అన్నట్టు
తుప్పర్ల పసే గాని, మంత్రాల పస లేదు
తుమ్మితే పోయె ముక్కు యెన్నాళ్లు వుండును
తుమ్ము తమ్ముడై చెప్పును
తురక దాసరికి యీత మజ్జిగ
తురకలు లేని వూళ్ళో దూదేకులవాడు సయ్యదుమియ్యా
తులసి కోటలో వుమ్మేసినా వేమిరా అంటే, యజ్ఞ వేదిక అనుకున్నాను అన్నాడట
తులసి వనములో గంజాయి మొక్క మొలిచినట్టు
తూమెడు వడ్లు తూర్పార పెట్టేటప్పడికి ఏదుము వడ్లు ఎలుకలు తిని పోయినవి
తృణము మేరువ, మేరువ తృణము
తెగించి దానము చేస్తాడు
తెగించిన వానికి తెడ్డే లింగము
తెగించి వెనకకు పోయినంత తెలివి తక్కువ లేదు
తెగువ దేవేంద్ర పదవి
తెచ్చుకొంటే భోంచేయి జగన్నాయకా, లేకుంటే వూరకుండు జగన్నాయకా
తెడ్డు నాకి వుపవాసములు మాన్పినట్లు
తెడ్డు ఏది అంటే, కొయ్య ఏది అన్నట్టు
తెడ్డు వుండగా చెయ్యి కాలుచుకున్నట్టు
తెలకల వాడి ముడ్డికింద రాయవలెనే
తెలివి తక్కువ, ఆకలి యెక్కువ
తెలిసి తెలిసి బొందను పడ్డట్టు
తెలిసేవరకు బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య
తేమానం తెగబారెడు
తేర గాడికి యేమిరా తెల్ల జొన్ననూగు
తేర గుర్రము, తంగేడు బరికె
తేలుకు పుట్టి చలిపురుగు అయినట్టు
తేలుకు పెత్తనమిస్తే, తెల్లవార్లూ అంతాపొడిచినాదట
తేలుకు ఎవరు అపకారము చేసినారు
తేళ్లలో కొండి, పాములలో పడగ
తొంగున్న సుంకరీ తలమూత దింపు
తొండకు ఎలుగు సాక్షి
తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు
తొంభై తొమ్మండుగురు పోగయి తోలు చిరగ పొడిచారు
తొక్కలేనమ్మా తొక్కులో నీళ్ళు పోసినాడట
తోక తొక్కిన పాములగున లేచినాడు
తోచీ తోచనమ్మా తోటికోడలి చెల్లి పెండ్లికి పోయినాదట
తోట కూరకు కడిగి పెట్టిన ఎసరే చాలును
ద
దశ దానాలకు తోటకూర కట్ట
దగా పోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్టు
దానము అయితే యివ్వలెను, దండగ అయితే పెట్టగలను
దారిని పొయ్యే వ్యాజ్యము కొని తెచ్చుకొన్నట్టు
దాసరి తప్పు దండముతో సరి
దాసరి పాటకు ముష్టి ముజరా (రావాల్సిన సొమ్ము)
దాసరి పాట్లు పెరుమాళ్లకు యెరుక
దాసరివా జంగమవా అంటే, ముందరి వూరుకొద్దీ అన్నాడట
దాసీ కొడుకాయైనా కాసు గలవాడు రాజు
దాస్తిని వేరుండు మొగుడా
దిక్కులేని దివానముగ ఉన్నది
దిక్కులేని యింట్లో దయ్యాలు కాపురము చేస్తాయి
దిక్కులేని వారికి దేవుడే దిక్కు
దిగులు పడితే, వెతలు తీరునా
దిన దిన గండము వెయ్యేండ్లు ఆయుస్సు
దినము మంచిదని తెల్లవార్లూ దొంగలించినట్టు
దివిటీ కింది దీపము
దివ్వె తీసిన గూడు వలె వున్నది
దిశమూలవాడా కాళ్ళకట్టు వానికి కప్పుమన్నట్టు
దిశమూలవాడి దగ్గిరికి దిగంబరుడు వచ్చి బట్ట అడిగినట్టు
దిగంబరుడు వచ్చి బట్ట అడిగినట్టు
దీపము ముడ్డి కింద చీకటి
దీపము వుండగానే చక్కపెట్టుకోవలసినది
దుక్కిటెద్దు దేశాంతరము వెళ్లినట్టు
దున్నక చల్లితే, కొయ్యక పండినది
దున్నపోతు యీనినడంతే, దూడను కట్టి వేయమన్నట్టు
దున్నబోతే దూడలలోనూ, మేయబోతే ఆవులలోనూ
దుబ్బు కాగేడు, వెన్ను మూరెడు, దూసితే దోసెడు, ఊడితే యేమీ లేదు
దుష్టునికి దూరముగా వుండవలసినది
దూడ కుడిచినట్టా దుట్టలో పడ్డట్టా
దూడ కుడిస్తేగానీ, ఆవు చేపదు
దూరపు కొండలు నునుపు, దగ్గరికి పోతే రాళ్ళూ గుండ్లూ
దెబ్బకు దెయ్యము కూడా హడలుతుంది
దేవుడిచ్చునేగాని తినిపించునా
దేవుడితోడు నా మీద దయ వుంచాల్సినది
దేవుడి పెండ్లికి అందరు పెద్దలే
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు
దొంగకు చేను పచ్చి లేదు
దొంగకు తలుపు తీసి దొరను లేపేవాడు
దొంగకు దొరికినదే చాలును
దూడ లేని పాడి దుఃఖపు పాడి
దొంగ చిక్కేనోయి అంటే, కరిచెనోయి అన్నాడట
దొంగ చెయ్యి దాచిపెట్టితే, అమావాస్య వచ్చినప్పుడు అల్లల్లాడినట్టు
దొంగతో కూడా దయ్యము వెంబడె వచ్చును
దొంగను తేలు కుట్టినట్లు
దొంగను పుట్టించినవాడు మతిభ్రషుట్ను పుట్టించక మానడు
దొంగల తల్లికి యెదవ భయము
దొంగలు కొట్టిన ఆరు మాసములకు కుక్కలు మొరిగినవి
దొంగలు తోలినా దేవుడు యే రేవున దాటినా వకటే
దొంగ వాకిట మంచము వేసినట్టు
దొంగవాడి పెండ్లాము యెప్పుడూ ముండమోపే
దొంగ కూడా మనిషే
దొంగిల బోతె మంగళం దొరికినది
దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకొని పోతే, గొడ్డు గేదె శ్రీ మహాలక్ష్మి అయినది
దొరలు యిచ్చిన పాలుకాన్నా ధరణి యిచ్చిన పాలు మేలు
దొరికిన సొమ్ముకు దొంగ అవుతాడా
దోవలో కూర్చుండి డబ్బు తిన్నట్టు
ద్వారపూడి పచ్చెపువాడి వట్టు
ధ
ధనియాల జాతి
ధర్మపురిలో దొంగిలించబోతూ దర్వాజాలోంచి వంగుకొని పోయినాడట
దాస్టికానికి ధర్మము లేదు, గుడ్డి కంటికి చూపు లేదు
ధీరుడయినా కావాలి, దీనుడైనా కావాలి
ధైర్యములేని రాజు, యోచనలేని మంత్రి
ధ్వంస పారాయణము, దంటు మంట
న
నంగి వంగలు మేస్తే నారికేళాలు దూడమేసినది అన్నాడట
నంగీ నమలక మింగవే అంటే, ఉడికిన చేపలు కరుస్తవి అన్నాడట
నంది అంటే నంది, పంది అంటే పంది
నంబి పెట్టినదే ప్రసాదము
నంబీ, తంబళి(హంస), నాగుబామూ, చెవుల పిల్లీ, ఎదురైతే చేటు వస్తుంది
నంబీ నంబీ నా పెండ్లికి యేమి సహాయము చేస్తావంటే, నీ పెండ్లికి నేను యెదురుగా రాకపోవడమే సహాయమన్నాడట
నక్క గూసి పిల్లకు దోవ తెచ్చును
నక్క జిత్తులన్నీ నావద్ద వుండగా నన్ను మోసము చేసే తాబేటి బుర్ర
నక్కకు చూచిన వాడెల్ల వేటగాడే
నక్క పోయిన వెనక బొక్క కొట్టుకొన్నట్టు
నక్క యెక్కడా, దేవలోకమెక్కడా
నక్క రేలకాయ సమయం
నక్కలు యెరగని బొక్కలూ నాగులు యెరగని పుట్టలూ ఉన్నావా
నట్టేట పుట్టి మునిగినట్లు
నడమంత్రపు దాసరి పొద్దుమానము యెరగదు
నడమంత్రపు సిరి, నరాలమీది కురుపు
నడవలేని అమ్మకు నాలుగు పక్కల సవారి
నడిచే కొద్దీ డొంక, పెట్టె కొద్దీ కుదురు
నత్తగుల్లలన్నీ ఒకరేవునా, ముత్యపు చిప్పలన్నీ ఒకరేవునా
నన్ను నేనే యెరగను, నిన్ను నేనేమి యెరుగుదును అన్నాడట
నామాల కూడని నారికేళము
నమాజు చేయబోతే, మసీదు మెడను పడ్డది
నమ్మితి రామన్నా అంటే, నా అంతవన్నీ చేస్తానన్నట్టు
నమ్మి నానబోసితే, పులిసి బుర్రతల్లాడెను
నరము లేని నాలుక నాలుగు విధాలు
నరుని కంట నల్ల రాయి పగులును
నలపాకము భీమపాకముగా వున్నది
నల్లిని గూర్చి మంచానికి పెట్లు
నల్లేరు మీద బండి పారినట్టు
నవాబు సాతుల్లా ఖాన్ అవ్వ నాటిది
నవాయతి పొట్టా తమలపాకుల కట్ట తడుపుతూ వుండవలెను
నవిలేవానికన్నా మింగేవాడు ఘనుడు
నవ్వ చెప్పేవాడు చెడ జెప్పును, యెడవ చెప్పేవాడు బ్రతక చెప్పును
నవ్విన నాపచేనే పండుతోంది
నవ్వుతూ తిట్టితివో నరకాన పడితివో
నవ్వు నాలుగండాల నష్టకారి
నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగవానినీ నమ్మరాదు
నామ్ బడా, దర్శన్ థోడా
నాకు ఆయుష్యమస్తు, నాకు ఆరోగ్యమస్తు
నాకు పరీక్షా, నా రాగి చెంబుకు పరీక్షా?
నాకూ నా పిల్లలకూ నూరేండ్లు ఆయుస్సు, నా పెనిమిటికి లోకము తోటిపాటు
నాకూ సిగ్గులేదు, రేపు వచ్చే అమావాస్యకూ సిగ్గులేదు
నాకోడీ, కుంపటీ లేకపోతె, ఎలాగు తెల్లవారుతున్నది
నాగవల్లి తీరినట్టు
నాగవల్లి నిష్టురము
నా చెయ్యి నొస్తున్నది, నీ చేతితో మొట్టుకో
నా చేతి మాత్ర, వైకుంఠ యాత్ర.
నాజూకు నక్కలు డేకితే, నరిసిన గడ్డము కుక్కలు పీకినవి
నాటకములు బూటకములు, బోటితనములు నీతులు
నాథుడు లేని రాజ్యము నానా దారులు అయినది
నానాటికి తీసిపెట్టు నాగంభొట్లు
నానా రుచులు పడి నాలికమీద కొరివపెట్టు కొన్నట్టే వున్నది
నా పతివ్రతా ధర్మము నా మొదటి పెనిమిటికి తెలుసు.
నా పప్పు కలిసినంత నేనే తింటాను
నా పాదమే గతి అన్నట్టు
నా ముందర బానెడు గంజా
నా యింటికి నేనే పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామము
నాలికా నాలికా వీపుకు దెబ్బలు తేక
నా వేలు పుచ్చుకొని నా కన్నె పొడిచినావా
నా సిరికన్నా అక్కసిరి ఘనము, అక్కసిరికన్నా నా సిరి ఘనము
నిండు కుండ తొణకదు
నిజమాడితే నిష్టూరమ
నిజము నిలకడమీద తెలియును
నిత్యము చచ్చేవారికి యేడ్చెవారు ఎవరు
నిద్రపోయేవాణ్ణి లేపవచ్చునుగాని, మేలుకొన్నవాడిని లేపకూడదు
నిద్రపోయిన వాడి కాళ్లకు మొక్కినట్లు
నిన్న కుప్పా, నేడు అల్లు (తీగ)
నిప్పుకు చెదలంటునా
నిప్పుకూ నీళ్లకూ వుండే స్నేహము
నిప్పు కొట్టితే రెండు అవునుగాని, నీల్లు కొట్టితే రెండు అవునా
నిప్పు ముట్టనిదే చెయ్యి కాలదు
నిప్పుల బుర్రకు నీళ్ల బుర్ర
నిప్పులు ఒళ్ళో కట్టుకొని వున్నాడు
నిమ్మకు నీరెత్తినట్లు
నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునికి ఆకలి
నిలవ నీడ పట్ట కొమ్మ లేదు
నిలుచుండ డానికి జాగా దొరికితే, కూర్చుండడానికి అప్పుడే దొరుకుతోంది
నివురు కప్పిన నిప్పు సమ్మెట (పెద్ద సుత్తి)
నిశ్చితార్థము నాదే నీలగ వలసినది, నాగవల్లి దాక వుండడము నా అదృష్టమే గదా
నిష్టా నీళ్ల పాలు. మంత్రము మాలల పాలు
నీ అరచేతికి పండ్లు వస్తే చూతము
నీకు రానిదీ, నేను విననిదీ, భూలోకములో లేనిదీ రానిదీ చెప్పుమన్నట్టు.
నీకు ఒక దండము, నీ బువ్వకు ఒక దండము
నీకూ నాకూ కాదు, రోలేటి తలబ్రాలు పోయమన్నట్టు
నీతి కానీ మాట రాతి వేటు
నీతిలేని వాడు కోటికన్న బీడు
నీ నొసటనే ప్రొద్దు పొడిచినదా
నీ పెండ్లి పాడుగా వున్నది గాని నా పెండ్లి తాంబూలానికి రమ్మన్నాడట
నీ పేరంటమే అక్కరలేదంట, కరకంచు చీరకట్టుకొని వస్తానన్నాడట
నీ ముష్టి లేకపోతె మానె గానీ, నీ కుక్కను కట్టివెయ్యి
నీ ఎడమ చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెట్టుతాను
నీరు, నీరు వంకనే పారుతున్నది
నీరు పల్లమెరుగును, నిజము దేవుడెరుగును
నీలి, నీళ్లకు పోతే బావి, లోతుకు పోయినది
నీళ్లలో నిమ్మలు బ్రతికినవి, అడివిలో తుమ్మలు బ్రతికినవి
నీళ్లు మూటకట్టినట్లు
నువ్వు కాకపోతే నీ అబ్బా మరిఒకడాయెను
నీవు చచ్చిన రోజు లేదు, నేను ఏడ్చినా రోజు లేదు
నీవు పెట్టకపోయినా పెట్టెయిల్లు చూపుమన్నది
నీవు ఒకందుకు పోస్తే, నేను ఒకందుకు తాగుతున్నాను
నీ సాకు చట్టబండలు కానూ, నాలుగు బేకులు బేకు అన్నాడట
నుయ్యి తియ్యబోతే, దయ్యము బయిలు వెళ్లినది
నువ్వుకు నోరు రోగాలు
నువ్వులు నూనె ఒకటి, గాండ్ల (నూనె అమ్మి జీవించెడు జాతి)వాడు వేరు ఒకటి
నూతికి నూలిపోగు, కోతికి గోవుతోకా
నూతి కప్పకు సముద్రము చేరువ
నూనె పోగొట్టుకొన్నవాడు ఏడ్చినాడు, బొండాపకాయల వాడు పొర్లి పొర్లి ఏడ్చినాడు
నూరి భరించ లేనమ్మ తాగేమి భరించును
నోరు కల్లలాడి అయినా, ఒక యిల్లు నిలప వలెను
నూరు కాకులలో వక కోవెల యేమి చెయ్యగలడు.
నూరు నోములూ వక రంకుతో సరి
నూరుమంది గుడ్డివాండ్లు పోగయి ఒక పాడు నూతిలో పడ్డట్టు
నూరుమంది మొండిచేతులవాండ్లు పోగయి ఒక గొడ్డు గేదెను పాలు పితక లేక పోయారు
నూరు మాటలు ఒక వ్రతానికి యీడు కావు
నూలిపోగు అతుకు
నెత్తి మూటకు సుంకమడిగినట్లు.
నెమలి కంట నీరు కారితే వేటగానికి ముద్దా
నెల తక్కువైన రాజు యింట పుట్టుమన్నట్టు
నెల బాలుడికి నూలిపోగు
నేడు చస్తే రేపటికి రెండు
నేతి కుండ నేలబెట్టి వట్టికుండా వుట్టిమీద పెట్టేవాడు
నేతి గూన ( పెద్ద కుండ ) చేత బూని నిచ్చెన యెక్కినట్లు
నేతి బీరకాయ సామ్యము
నేను పుట్టకపోతే నీకు పెండ్లామే లేకపోను అంటే, నువ్వు పుట్టకపోతే నీ తల్లిని పెండ్లాడి వుండును అన్నాడట
నొసట వ్రాసిన వ్రాతలు తప్పవు
నోటికి చేతిని యెంగిలి లేదు
నోటి ముత్యాలు రాలి పోతాయా
నోట్లో ఆవగింజ దాగ దు
నోరు అంబాలపు పండు, చెయ్యి బలుసు ముల్లు
నోరు కలిగితే బ్రతుకుతాడు
నోరు కొవ్వి నీళ్ళు కారడము
నోరు మంచిదైతే వూరు మంచిది
నోరు మాట్లాడుతోంటే, నొసలు యెక్కిరిస్తూ వస్తున్నది
న్యాయము తప్పని వానికి ఆచార్య కటాక్షమెందుకు