సాన పెట్టని వజ్రం  (Author: పి.లక్ష్మీ ప్రసన్న)

రేపటి ఉనికికై తన కొన ఊపిరి నిలుపుకోవటం కోసం

నిరంతరం ఆరాటపడే మాతృమూర్తి తెలుగు.

త్వజించిన తనయులకై తపన పడుతూ

పరభాషా పదాల అలంకరణ పులుముకున్న అమృతమూర్తి తెలుగు.

గుండ్రని చందమామ లాంటి అక్షరాల సొంపు సొంతం చేసుకున్న

మన తెలుగుకి, పరభాషా గ్రహణపు చీకట్లు ముసిరినవి.

ఆ ఆంగ్ల గ్రహణం వీడి మన కనులను చేరేనా..

పూర్వ వైభవ నిండు పౌర్ణమి తెలుగు వెలుగులు.

జాతీయాల జాణతనము తెలిసిన తెలుగు.!

నుడికారాల నవ్యత్వం నేర్పిన తెలుగు.!

శబ్దపల్లవాల సవ్వడి వినిపించే తెలుగు.!

మాండలికాల మధురిమలొలికించే తెలుగు.!

అటువంటి మన అమ్మ భాషను అన్యదేశీయులు సైతం అలఓకగా మెచ్చుకుంటుంటే..

పరభాష పట్ల మోజుతో తెలుగుని”టెల్గు” చేసి విష సంస్కృతి వ్యాప్తిచేస్తూ..

భావితరాల భవిష్యత్తులో తెలుగును ప్రశ్నార్థకం చేస్తున్నారు

అమ్మభాష అక్షరాల ఆణిముత్యపు సొగసులు ఆల్చిప్పలోనే దాచేస్తే…

అపురూపమైన ముత్యపు మాలల కాంతులు మనసును తాకే మార్గమేది?

సులభంగా లభించిన అరుదైన వజ్రం లాంటి మాతృభాషను

సాన పెట్టక సమాధి చేస్తే… సప్తవర్ణాలు ఆవిష్కరించే అవకాశం ఏది?

మనదన్నది ఏదైనా అంతులేని మమకారం,

మరి ఎందుకు తెలుగు పైన ఈ మనసు లేని పక్షపాతం.

మనదన్నది ఏదైనా అంతులేని మమకారం,

మరి ఎందుకు తెలుగు పైన ఈ మనసు లేని పక్షపాతం.

Kommentare hinzufügen