అధ్యక్షుని కలంనుండి
అధ్యక్షుని కలంనుండి...
తెలుగు కళా సమితి సభ్యులకు , శ్రేయోభిలాషులందరి కీ నమస్సుమాంజలులు.
పద్య, పద్యనాటకం కేవలం తెలుగు భాషకు మాత్రమే సొంతం. తెలుగు కళా సమితిలో మొట్టమొదటి సారిగా అమెరికా లో పుట్టి పెరిగిన పిల్లలతో పద్యనాటకం ప్రదర్శింపచేయటం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ మరియు కళావేదిక సంస్థ సహకారంతో 2023 జులై 16 వ తేదీన శ్రీకృష్ణరాయబారం నాటకం ప్రదర్శన విజయవంతంగా నిర్వహించాము. ఇక్కడి మహిళలు, బాల బాలికలతోనే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించాలని మా సంకల్పం. ఇక మనం తెలుగు కళా సమితి 40వ వార్షికోత్సవం నిర్వహించటానికి సన్నద్ధులం అవుతున్నాము.
మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని చక్కటి కార్యక్రమాలు చేయాలనీ మా సంకల్పం. మీ సద్విమర్శలని, సలహాలని పంపించాలని నా మనవి .
మీ
రాచకుళ్ళ మధు.
అధ్యక్షులు, తెలుగు కళా సమితి
201-312-1305