సెల్ ఫోన్ సిక్ లీవ్....  (Author: దాసరి మోహన్)

సెల్ ఫోన్ సిక్ లీవ్ పెట్టుకుంది 

 పొద్దు మాపు ఆమె ఇంటి వంటా ముచ్చట్లు 

 రాత్రి అంతా అతను నీలి జాతర వెతుకులాట

 ఇక రెక్కలు చాచేది ఎప్పుడని 

 

  ఛార్జింగ్ కు సైతం ఛాన్స్ ఇవ్వని యూత్ 

  పవర్ బ్యాంక్ బరువు కూడా బోనస్ 

  పుస్తకం పోయి పిడిఎఫ్ లు వచ్చే 

  ప్రతి విద్యార్థి తో ఇక OT చేయక తప్పదాయే 

 

  బిజినెస్ కు పెట్టుబడి ఏమో కాని 

  మొబైల్ మాత్రం తప్పని సరి 

  పాన్ కనెక్ట్ అయినాక పాపం 

  బ్యాంక్ పనులు అన్నీ తానే మోయక తప్పలేదు 

 

  Whatsup తో జత కట్టి నoక 

  పాపా లు ఎన్ని మో స్తుoదో మరి 

  ఎవరు ఎవరితో వూసులు ఎలగ పెడుతున్నారో 

  వూచలు లెక్క పెట్టినప్పుడు మాత్రమే తెలిసింది 

  

  Reel పిచ్చి పట్టినoక రికాo లేదు 

  ఏదో ఒకటి experiment చేసి ఏడిపించు 

  ఇంటి ఆకలి మాత్రం zomato తీర్చు 

  కిచెన్ కు విరామం ఇచ్చి తాను బలి అయ్యింది 

 

  రెస్ట్ రూమ్ లో కూడా చెంత వదలకుండా 

  నిద్ర లో మునిగిన గానా బజానా ఆగదు కదా 

  సెల్ ఫోన్ మొర పెట్టుకుంటుoది మనిషి తో 

  సిక్ లీవ్ ఇవ్వాలని సిమ్ సళ్లారే వరకు అయినా...

0 comentaris