మర్యాదగానే ఒప్పేసుకుందాం...  (Author: బి.కళాగోపాల్)

వారు వయసుకు మించిన ఆరిందాలు

స్టెప్పులేయించే సర్కస్ ఫీట్లకు

తెర వెనుక స్క్రిప్ట్ లు ఆడించే తోలు బొమ్మలు

 

టిఆర్పీలను వేడెక్కించే స్క్రీన్ ప్లేల జిమ్మిక్కులలో

బాల్యమిప్పుడొక ఎసెన్షియల్ ఎంటర్ టైన్ మెంట్ కమాడిటీ

తండ్రిబిడ్డల ప్రేమబంధానికి అశ్లీల కామెంట్లను జోడిస్తూ

ఫార్వర్డ్ స్క్రీన్ షేర్ లతో రీల్స్ షాట్స్ మీమ్స్ లను వైరల్ చేసే

పెద్దలకు బాల్యమిప్పుడొక కాలక్షేప బేరం

 

డార్క్ కామెడీ రివ్యూలలో ఇన్ ఫ్లుయెన్సర్స్ అంటూ

కాలరెగరేసే ఘోస్ట్ రోస్టర్ లకు

బాల్యమిప్పుడొక పేరులేని పర్వర్షన్స్ ఈజీ టార్గెట్

షేరింగు ట్రోలింగ్ రాహుకేతుల నీడన

బురద అంటుకుంటున్న పాలబుగ్గల పసితనాన్ని

 షోకేసుల్లో బంధిస్తున్న సబ్ స్ర్కైబర్స్ లకు

 బాల్యమిప్పుడొక కాసుల వర్షం కురిపించే రంగస్థలం..!

 

"మా పిల్లలూ.. మా ఇష్టముంటున్న" పెద్దల ప్రిజుడీస్ మాటున

కానరాని చిట్టి చేతుల గుజ్జన గూళ్ళు

జారిపోయిన బాలానందం చందమామ ఆత్మల మాటున

చేజారుతున్న పసిఛాయల్లో

అమానవీయంగా చిగురు దేహాల గుట్టురట్టవుతుంటే ..

బాల్యమిప్పుడొక సామాజిక ఉపద్రవంలో సమిధ యని

సభ్యతాపూర్వకంగానైనా సారి ఒప్పుకుందామా?

 

జాడలేని పోక్సో జువైనల్ యాక్టుల్లో భద్రత కరువైన

సేలబుల్ బాల్యం నేరమెవ్వరిదని ప్రశ్నిస్తుంటే..?

తెల్పినా ఒప్పుకోని నేరం మనందరిదని..

మర్యాదపూర్వకంగానైనా ఓసారి ఒప్పేసుకుందాం..!!

0 comentaris

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)