నా కలం కలగంటోంది
నా కలం కలగంటోంది (Author: శివ జ్యోతి)
నా కలం కలగంటోంది
కురిసే వర్షానికి కబుర్లు చెప్పాలని
మెరిసేమేనికి సొంతం అవ్వాలని
మచ్చలేని మజిలీలు ఎన్నో మొదలు పెట్టాలని
పచ్చదనాల పల్లెల పంచన చేరాలని
నిష్కల్మష హృదయాల నెలవుకావాలని
ఈ జగతిని జాగృతం చేయాలని
సమాజపు కుళ్ళు కడిగేయాలని
యువత కళ్ళు తెరిపించాలని
దౌర్జన్యం దుమ్ము దులిపేయాలని
రామరాజ్యం మళ్లీ రావాలని
తరాల ఆలోచనల అంతరాలు చెరపాలని
అంతస్తుల వైషమ్యాలు అంతం చేయాలని
ఆంతర్యాల మాలిన్యం అంతం అవ్వాలని
అంతర్జాల మంతనాలు కుదించాలని
దుర్మార్గుల మది దుర్గం చొచ్చుకు చీల్చాలని
మంచితనం ముంగిట ముద్దుల ముగ్గేయాలని
నాలా అందరూ నవ్వుతూ ఉండాలని.