గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’  (Author: Vishal (Telugutimes.net))

లక్ష్మీపురంలో కనులవిందుగా కృష్ణ లీలా తరంగిణిఉత్సవం

Published By: Vishal / Telugutimes.net * January 11, 2026 / 08:39 AM IST

లక్ష్మీపురం: శ్రీ నారాయణ తీర్థుల వారి గౌరవార్థం స్థానిక లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం వేదికపై శనివారం సాయంత్రం కృష్ణ లీలా తరంగిణి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు కళా సమితి (న్యూ జెర్సీ, USA), శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.

కార్యక్రమ విశేషాలు: తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ అన్నా మధుసూదనరావు మాట్లాడుతూ.. తన జన్మస్థలంలో తన సంస్థ ద్వారా మహోన్నత వాగ్గేయకారుడు నారాయణ తీర్థుల రచనలను గాత్ర, నృత్య రూపాల్లో ప్రదర్శించడం ఎంతో తృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు తమ గాన మాధుర్యంతో, నృత్య రీతులతో నారాయణ తీర్థ తరంగాలను అద్భుతంగా ఆవిష్కరించారు.

హాజరైన ప్రముఖులు: ఈ సభలో ముఖ్య అతిథులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి బీ.వీ. రమణకుమార్, ఏపీ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవ, ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్, చార్టర్డ్ అకౌంటెంట్ వీ.వీ.ఎస్. రవి, హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకులు కళారత్న స్వర వీణాపాణి పాల్గొన్నారు.

గౌరవ అతిథులుగా విశ్రాంత జడ్జి జీ.వీ. కృష్ణయ్య, మాస్టర్ క్రియ యోగ ఉమా మహేశ్వరరావు, వై. శివాజీ, త్యాగరాజ సాంస్కృతిక సంఘం ప్రతినిధులు రామరాజు శ్రీనివాస రావు, వల్లూరి కృష్ణ కిశోర్ తదితరులు ప్రసంగించారు. న్యూ జెర్సీ నుంచి తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యులు అంతర్జాలం ద్వారా ఈ వేడుకను వీక్షించి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కళాభిమానుల ప్రశంసల మధ్య ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

0 comentaris

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)